తిరుమలలో అక్రమాల నివారణకు ఫేస్‌ ‌రికగ్నిషన్‌

తిరుమల, ఫిబ్రవరి  : తిరుమలలో అక్రమాల నివారణకు టీటీడీ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్‌ ‌చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా ఫేస్‌ ‌రికగ్నిషన్‌ ‌టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. మార్చి ఒకటో తేదీ నుంచి ఈ టెక్నాలజీని తీసుకురానుంది. సర్వదర్శనం కాంప్లెక్స్ ‌లో ఒకే వ్యక్తి అధిక లడ్డు టోకెన్లు పొందకుండా, గదుల కేటాయింపు కేంద్రాలు వద్ద, కాషన్‌ ‌డిపాజిట్‌ ‌కౌంటర్ల వద్ద ఈ టెక్నాలజీని వినియోగంలోకి తీసుకురానున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మార్చి 2 నుంచి 10వ తేదీ వరకు జరుగనున్న వార్షిక కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశిం చారు. కల్యాణోత్సవాల ఏర్పాట్లపై ఆయన వర్చు వల్‌ ‌సమావేశం నిర్వహించారు. మార్చి 3న జరిగే కల్యాణోత్సవానికి విశేషంగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్రత్యేకంగా క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని, రద్దీ క్రమబద్దీకరణకు నిఘా, భద్రతా సిబ్బందితోపాటు స్థానిక పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు. భక్తులకు తాగునీరు అందుబాటులో ఉంచాలని, వైద్య బృందాలను నియమించాలని కోరారు.

ఈ ఉత్సవాల్లో వినియోగించే వాహనాలు, రథం పటిష్టతను ముందస్తుగా పరిశీలించాలన్నారు. చక్ర స్నానం కోసం పుష్కరిణిలో అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఆలయంలో ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుత్‌ ‌దీపాలంకరణలు చేపట్టాలని ఆదేశించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంలో మార్చి 4 నుండి 8వ తేదీ వరకు జరుగనున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో మార్చి 2 నుంచి 8వ తేదీ వరకు జరుగనున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సవి•క్ష నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *