తమిళనాడులో పొంగల్‌ ‌వేడుకలు

చెన్నై, జనవరి 14 : తమిళనాడులో పొంగల్‌ ‌వేడుకలు కోలాహలంగా మొదలయ్యాయి. గ్రామాల్లో పండగ సందడి నెలకొంది, ఇళ్లముందు రంగురంగుల రంగవల్లులు వేసి పొంగలి వండివార్చారు. తమిళ సంప్రదాయంలో పొంగలికి ప్రాధన్యం ఉంది. ఇకపోతే సంక్రాంతి పండుగ సందర్బంగా నిర్వహించే జల్లికట్టు పోటీలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా జల్లికట్టు నిర్వహించేందుకు  భారీ ఏర్పాట్లు చేశారు.  జల్లికట్టును వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రేక్షకులు ఇప్పటికే తమిళనాడు చేరుకున్నారు.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి నేపథ్యంలో సంబరాలు అంబరాన్నంటాయి. పలు సంస్థలు, కార్యాలయాలు, పార్టీల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా చిన్నారులకు పరుగు, త్రోబాల్‌ ‌పోటీలు నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో క్టటెల పొయ్యిలో పొంగల్‌ను కలెక్టరు వండారు. కోయంబత్తూరులో సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. .వ్యవసాయ పాఠశాల విద్యార్థినులతో కలిసి కొత్త కుండల్లో పొంగలి వండి వేడుకలను ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *