డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇస్తే కఠిన చర్యలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 7 : అమనగల్లు మున్సిపాలిటీ, మండలంలో వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా డ్రైవింగ్ లైసెన్సు కలిగివుండాలని లేని పక్షంలో జరిమానా తప్పదని అమనగల్లు ఎస్సై బాల్ రామ్ వాహనదారులకుచ్చరించారు.  గురువారం పోలీస్ స్టేషన్ లో ఎస్సై బాల్ రామ్ మాట్లాడుతూ లైసెన్సు. హెల్మెంట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకొంటమన్నారు, మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమాని బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు, వాహనదారులకు అన్నీ రకాల అనుమతి పత్రాలు కలిగి ఉండాలని కోరారు. రహదారిపై వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెంట్ ధరించాలని సూచించారు. అలాగే వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్ ప్రతి సంవత్సరం విధిగా రెన్యూవల్ చేయించుకోవాలని అన్నారు. ప్రయాణం చేసేటప్పుడు అనుకోకుండా ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇన్సూరెన్స్ లేని సమక్షంలో వారికి ఒక్క రూపాయి కూడా నష్ట పరిహారం వచ్చే అవకాశం ఉండదని అన్నారు, ముఖ్యంగా మద్యం సేవించి, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని అన్నారు,.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *