షాద్ నగర్ ట్రాఫిక్ ఎస్సై రవీందర్ నాయక్
జాతీయ లోక్ అదాలత్ లో ఆఖరు అవకాశం రేపే
మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు చేతికి ఇవ్వోద్దు
షాద్ నగర్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలోని 9 పోలీస్ స్టేషన్లో భారీ పహారా
షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 29: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన బాధితులు రేపు షాద్ నగర్ లో జరగబోయే జాతీయ లోక్ అదాలత్ చివరి రోజున తమ కేసులు పరిష్కారం చేసుకోవచ్చని షాద్ నగర్ ట్రాఫిక్ ఎస్సై రవీందర్ నాయక్
అన్నారు. శుక్రవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. షాద్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 9 పోలీస్ స్టేషన్లు షాద్ నగర్ కొత్తూరు నందిగామ కేశంపేట కొందూర్గు చౌదరిగూడ ఆమన్ గల్ కడ్తాల్ తలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 2238 ఉన్నాయని, వీటిలో 400 కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించినట్లు చెప్పారు. అదేవిధంగా మైనర్ లైసెన్సులకు సంబంధించి 69 కేసులు ఉండగా 50 కేసులు పరిష్కారం అయ్యాయని తెలిపారు. రేపు శనివారం లోక్ అదాలత్ చివరి రోజని పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించి బాధితులు పరిష్కరించుకోవాలని కోరారు. రేపు ఉదయం 10 గంటల లోపు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సంప్రదించి కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. తల్లిదండ్రులు మైనర్ల చేతికి వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. దీనివల్ల వారి బంగారు భవిష్యత్తు పాడవుతుందని అదేవిధంగా తల్లిదండ్రులపై కూడా కేసులు ఉంటాయని అన్నారు. రోడ్లపై వాహనాలు నడిపించేటప్పుడు తప్పకుండా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని అన్నారు. సీటు బెల్డు క్రమం తప్పుకోకుండా పెట్టాలని, హెల్మెట్లు పెట్టుకోవాలని, స్పీడ్ లిమిట్ పాటించాలని సూచించారు. అదేవిధంగా ఇదివరకు వాహనాలపై ఉన్న చలాన్లను ప్రభుత్వ రాయితీతో చెల్లించుకోవచ్చని అన్నారు. ఈ అవకాశం వచ్చే నెల 10వ తేదీ వరకే ఉంటుందని అన్నారు. జాతీయ రహదారిపై కేవలం 80 స్పీడ్ లిమిట్ మాత్రమే ఉంటుందని రింగ్ రోడ్డులో 120 స్పీడ్ లిమిట్ ఉందని చెప్పారు. ఇది దాటితే చలాన్లు పడతాయని హెచ్చరించారు.
*31 డిసెంబర్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు*
డిసెంబర్ 31న షాద్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలోనీ 9 పోలీస్ స్టేషన్ల పరిధిలో పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని ఎస్ఐ రవీందర్ నాయక్ హెచ్చరించారు. అతిగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని ప్రమాదాలకు కారణం కారాదని సూచించారు. డిసెంబర్ 31 సందర్భంగా యువత హెల్మెట్లు పెట్టుకోకుండా ఉంటె చర్యలు తీసుకుంటామన్నారు.రాష్ డ్రైవింగ్ చేయొద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా 40 మంది ప్రత్యేక సిబ్బంది 10మంది మహిళా పోలీసులు, సుమారు 5 మందికి పైగా సిఐలు డిసెంబర్ 31 రోజుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా చేపడతారని పేర్కొన్నారు. కడ్తాల్ టోల్గేట్ అదే విధంగా రాయికల్ టోల్గేట్ ఎలికట్ట చౌరస్తా కొత్తూరు జంక్షన్ చటాన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి తదితర పాయింట్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్సై లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు..





