హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 27 : అల్టిమేట్ ఖోఖో(యూకెకె) దాని గ్రాండ్ సెకండ్ ఎడిషన్‌కు సిద్ధమైందని అల్టిమేట్ ఖో ఖో ప్రతినిధులు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 164 మిలియన్ గృహాలకు చేరుకున్న వినోదభరితమైన ప్రారంభ సీజన్‌తో ఒడిశాలోని కటక్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో డిసెంబర్ 24 ప్రారంభమైన ఈ ఎడిషన్ 13 జనవరి 2024న ముగుస్తుందని తెలిపారు. సిఎం నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఔత్సాహిక క్రీడాకారులకు మౌలిక సదుపాయాలు కల్పించి ‘యువతకు క్రీడలు, భవిష్యత్తు కోసం యువత’ అనే దార్శనికతతో ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో కొన్ని ప్రధాన ప్రపంచ క్రీడా కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా ప్రపంచ స్థాయి బహుళ క్రీడలను అభివృద్ధి చేసిందన్నారు.
డిసెంబర్ 24 నుంచి అల్టిమేట్ ఖో ఖో సీజన్-2




