డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి రెండు సంవత్సరాలు పూర్తయినా నేటి వరకు ప్రజలకు ఎందుకు అందజేయలేదు

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్టు 1 :  నియోజకవర్గంలోని మంచాల మండలం లింగంపల్లి చౌరస్తాలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంగళవారం ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈసీ.శేఖర్ గౌడ్ (మామ)పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,రాష్ట్రంలో ప్రటిపక్షాలను పోలీసులచే కెసిఆర్ అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదని,తమ కార్యకర్తలను,నాయకులను  ఎక్కడిక్కడ ఆపడం వల్ల కార్యకర్తలు రాకుండా ఉంటారనేది కెసిఆర్ దుర్మార్గపు ఆలోచన మానుకోవాలని లేదంటే రేపు వచ్చే ఎనికల్లో కెసిఆర్ కు సరైన బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు.డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి రెండు సంవత్సరాలు పూర్తయినా ఇప్పటివరకు ప్రజలకు ఎందుకు అందజేయలేదని ఆయన ప్రశ్నించారు.దీనికి కారణం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అని ఆరోపించారు.మంచాల మండల ప్రజలకు చెందాల్సిన డబుల్ బెడ్ రూం ఇండ్లు శిథిలావస్థలకు చేరుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల కోసం ఎదురుచూస్తూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇస్తే ఓట్లు రాలుతాయని ఒక దురుద్దేశంతో ప్రజల డబ్బుతో కట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రజలకు ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నారో ప్రజలకు తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంచాల మండలం ప్రజలకు మాత్రమే చెందాలని,కానీ మంచి రెడ్డి కిషన్ రెడ్డి కావాలని వేరే మండల ప్రజలకు ఇచ్చినట్లయితే దానికి పూర్తి బాధ్యత మంచిరెడ్డి కిషన్ రెడ్డి వహించాల్సి వస్తుందని అన్నారు.ఈవారం రోజుల్లో  మంచాల మండల ప్రజలకు ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అప్ప చెప్పకపోతే మేమే అర్హులైన పేద ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్ప చెప్తామని,గృహప్రవేశాలు చేయిస్తామని హెచ్చరించారు.కెసిఆర్ తొమ్మిది సంవత్సరాల క్రితం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కడుతున్నామని,తెలంగాణలో ప్రజలకు ఇబ్బందిగా ఉంది ఒక కుటుంబంలో నలుగురు ఉంటే ఒక్క ఇల్లు ఏం సరిపోతుందని ఆవేదన వ్యక్త పరిచిడాడని తెలియజేశారు.అత్త వస్తే ఏడ ఉంటది అల్లుడు వస్తే ఏడ పడుకుంటారని గొప్పలు పలికిన కెసిఆర్ ఇంతవరకు కట్టిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లనే ప్రజలకు పంచలేని దుస్థిలో కెసిఆర్ ప్రభుత్వం ఉందని ఆయన ఆరోపించారు.అప్పులపాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడి నుంచి ఇండ్లు కట్టిస్తారని అన్నారు.కెసిఆర్ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ప్రజలకు సూచించారు.రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండే ప్రభుత్వం వస్తుందని, ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలోత్యాళ్లపల్లి కృష్ణ,తమ్మల కృష్ణ,ఉడుగుల శివ,మురళి,బండలేమూరు ఉప సర్పంచ్ సత్యం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *