టీమ్స్ హాస్పిటల్స్ పనులను పర్యవేక్షించిన  ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని చైతన్యపూరి డివిజన్ నందు నూతనంగా నిర్మిస్తున్న టీమ్స్ హాస్పిటల్స్ పనులను ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ హాస్పిటల్ దాదాపు 26 అంతస్థులతో నిర్మాణం జరుగుతుందని తెలిపారు. హాస్పిటల్ స్థల పరిసరాల్లో ప్రస్తుత భావితరాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు నందు స్థలాలు దొరకడం కష్టంగా భావించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఒప్పించి పోలీస్ స్టేషన్, చిల్డ్రన్ పార్క్, సబ్ స్టేషన్, వాటర్ ట్యాంక్, ఒక అద్భుతమైన కమ్యూనిటి హాల్ కూడా నిర్మించడం జరుగుతుందని తెలిపారు. వీటితోపాటు గుడి, మసీదు కూడా నిర్మించడం జరుగుతుందని తెలిపారు. హాస్పిటల్ కు వచ్చే వారు సేదతిరడానికి ప్రక్కనే అయిదు అంతస్థుల భవనం కూడా నిర్మించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం 2 స్లాబుల నిర్మాణం జరిగిందని, ప్రతి 25 నుంచి 30 రోజులకు ఒకసారి ఒక్కో స్లాబ్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. నాణ్యత ప్రమాణాలలో తగిన భద్రత చర్యలు పాటిస్తూ పనులు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రామకృష్ణ అధికారులు సుభాష్, రాజు, ఆశాజ్యోతి, పద్మాకర్, భాస్కర్ రెడ్డి, సంతోష్, కుమార్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *