టిపిసిసి ప్రచార కమిటి కో- చైర్మన్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కప్పాటి పాండురంగారెడ్డి శుభాకాంక్షలు

కందుకూరు, ప్రజాతంత్ర, జూలై 18 : టిపిసిసి ప్రచార కమిటి కో- చైర్మన్‌గా మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని రాహుల్ గాంధీ అభిప్రాయం మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించిన సందర్భంగా కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డితో కలసి నగరంలోని పొంగులేటి నివాసంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి అసమర్థత కుంభకోణాల బిఅర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దే దింపి కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేసే సమర్థవంతమైన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రచార కమిటీ కో ఛైర్మన్ గా నియమించిన అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే,సోనియా,రాహుల్, ప్రియాంకా గాంధీ,ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు.వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.పొంగులేటిని కలసిన వారిలో కాంగ్రెస్ యువజన నాయకుడు గుల్ల సంతోష్ ముదిరాజ్, సీనియర్ నాయకులు బొల్లారం వెంకట్రామ్ రెడ్డి,చింతపట్ల పవన్,మట్ట నర్సింగ్ రావు,నర్సింగ్ యాదవ్,కార్తీక్ రెడ్డి, కొల్లూర్ భీమేశ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *