హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : తెలంగాణ అమెరికా తెలుగు సంఘం(టిటిఎ) ఆధ్వర్వంలో నగరంలో నిర్వ హిస్తున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 16వ తేదీ ఉదయం ‘నా ఊరు-ఆ రోజుల్లో’ పేరిటి 5కె రన్ నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహిస్తున్నామని అవనరం ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి విజయకాంత్, టిటిఎ చీఫ్ కో-ఆర్డినేటర్ డా.ద్వారకానాథ్ రెడ్డి, అంతర్జాతీయ క్రీడాకారుడు బికాస్ కారార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రస్తుతం యువతీ, యువకులు చిన్ననాటి ఆటలు మరిచిపోతున్నారని, అంతరించిపోతున్న ఆటలను తిరిగి సమాజానికి అందించడానికి వీలుగా ఆ రోజు మధ్యాహ్నం నుంచి యువతీ, యువకులకు గిల్లిదండ, గోలీలు, బొంగరం, తొక్కుడు బిళ్ళ, అష్టా చెమ్మ, కచ్చకాయలు, రింగ్, ఓముడు గుంటలు, జంగ్లీంగ్ ఫీట్స్, బాల్స్, లట్టు, దాగుడు మూతలు, తాడాట(స్కిపింగ్), తదితర ఇండియన్ ట్రేడిషనల్ గేమ్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. నేడు ప్రతి ఒక్కరి చేతిలోకి మెబైల్ ఫొన్ రావడంతో ఆనాటి ఆటలకు పిల్లలకు దూరం అయ్యారని విచారం వ్యక్తం చేశారు. నేటి తరం పిల్లలకు ఈ ఆటలను పరిచయం చేయడం కోసం తాము కృషి చేస్తున్నామని వారు వివరించారు.
టిటిఎ ఆధ్వర్యంలో ’16న నెక్లెస్ రోడ్ లో 5కె రన్’




