టాప్‌-10 ‌సంపన్నుల జాబితా నుంచి అదానీ ఔట్‌

‌క్షీణిస్తూ వొస్తున్న సంపద
న్యూ దిల్లీ, జనవరి 31 : ఆసియా కుబేరుడు గౌతమ్‌ అదానీ గ్రూప్‌ ‌స్టాక్స్ ‌పతనం కొనసాగుతుండటంతో సంస్థ చైర్మన్‌ అదానీ సంపద క్షీణిస్తూ వొస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రపంచ సంపన్నుల టాప్‌-10 ‌జాబితాలో స్థానాన్ని కోల్పోయారు. బ్లూమ్‌బర్గ్? ‌బిలియనీర్స్ ఇం‌డెక్స్ ‌ప్రకారం..2023 జనవరి 31 నాటికి గౌతమ్‌ అదానీ సంపద 84.4 బిలియన్‌ ‌డాలర్లుగా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడిగా బెర్నార్డ్ ఆర్నాల్ట్ ‌కొనసాగుతున్నారు. ఆయన నెట్‌ ‌వర్త్ 189 ‌బిలియన్‌ ‌డాలర్లు. ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా, ట్విట్టర్‌ ఓనర్‌ ఎలాన్‌ ‌మస్క్ ‌రెండో స్థానంలో ఉన్నారు. 124 బిలియన్‌ ‌డాలర్లతో అమెజాన్‌ ‌సీఈఓ? జెఫ్‌ ‌బెజోస్‌ ‌మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అదానీ గ్రూప్‌లో ఆర్థికపరమైన అవకతవకలు జరుగుతున్నాయని..ఇతర మార్గాల్లో డబ్బును విదేశాలకు పంపించి, అదానీ స్టాక్స్‌ను సంస్థే కొనుగోలు చేస్తుందని హిన్‌డెన్‌ ‌బర్గ్ ‌రీసెర్చ్ ఓ ‌నివేదికలో పేర్కొంది. ఫలితంగా అదానీ గ్రూప్‌ ‌స్టాక్స్‌ను మేనిప్యులేట్‌? ‌చేస్తుందని ఆరోపించింది.

ఈ నివేదిక నేపథ్యంలో అదానీ స్టాక్స్‌లో బుధవారం నుంచి భారీ పతనం కొనసాగుతుంది.? అప్పటి వరకు ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉండే గౌతమ్‌ అదానీ.. శుక్రవారం ట్రేడింగ్‌ ‌సెషన్‌ ‌ముగిసే సమయానికి 7,8 స్థానాలకు పడిపోయారు. తాజాగా.. టాప్‌-10 ‌నుంచి బయటకొచ్చేశారు. గడిచిన 24 గంటల్లో.. అదానీ 8.21 బిలియన్‌ ‌డాలర్ల సంపదను కోల్పోయారు. ఇక ఈ ఏడాదిలో ఇప్పటివరకు 36.1 బిలియన్‌ ‌డాలర్ల సంపద ఆవిరైపోయింది. మరోవైపు మంగళవారం కూడా..పలు అదానీ గ్రూప్‌ ‌స్టాక్స్ ‌లోయర్‌ ‌లిమిట్‌ను టచ్‌ ‌చేశాయి. అదానీ టోటల్‌ ‌గ్యాస్‌ 10‌శాతం పతనంతో లోయస్‌ ‌సర్క్యూట్‌ను తాకింది. అదానీ ఎంటర్‌‌ప్రైజెస్‌ 2‌శాతం పడిపోయింది. అదానీ గ్రూప్‌నకు చెందిన 10 కంపెనీల విలువ 75 బిలియన్‌ ‌డాలర్లు పతనమైంది. హిన్‌డెన్‌ ‌బర్గ్ ‌రీసెర్చ్ ‌నివేదికను అదానీ గ్రూప్‌ ఇప్పటికే ఖండించింది. సంస్థలో అవతకవకలు జరగలేదని 400కుపైగా పేజీలతో కూడిన వివరణను బయటపెట్టింది. అయినప్పటికీ.. అదానీ గ్రూప్‌ ‌స్టాక్స్ ‌పతనం కొనసాగుతుండటం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *