- కెసిఆర్ దక్షతకు రుణామఫీ ఓ ఉదాహరణ
- మంత్రి కెటిఆర్ వ్యాఖ్యలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 3 : బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్ అన్నారు. జై కిసాన్ అనేది తమకు కేవలం ఓ నినాదం కాదని, తమ ప్రభుత్వ విధానం అని తేలిపోయిందని చెప్పారు. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా, బీజేపీ సర్కారు అడుగడుగునా ఆర్థిక ఇబ్బందులు సృష్టించినా, రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం..
ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్ప బలానికి నిలువెత్తు నిదర్శనమని వెల్లడించారు. రైతు సంక్షేమంలో తొమ్మిదేండ్ల తెలంగాణ ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయమని చెప్పారు. రైతుకు రక్షణ కవచంగా అమలు చేసిన ప్రతి పథకం వ్యవసాయ రంగ చరిత్రపై చెరగని సంతకమన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయం అంటే సంక్షోభం.. కానీ, ఒక్క తెలంగాణలోనే వ్యవసాయం అంటే సంతోషమని పేర్కొన్నారు. యావత్ తెలంగాణ రైతాంగం ముక్తకంఠంతో చేస్తున్న నినాదమిదని సోషల్ వి•డియా వేదికగా స్పష్టం చేశారు.




