జూలై 20 నుంచి పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాలు

  • పాత భవనంలో ప్రారంభమై
  • ఆగస్టు 11న కొత్త భవనంలో ముగియనున్న సెషన్‌

న్యూ దిల్లీ, జూలై 1 : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషీ శనివారం ఓ ట్వీట్‌ ‌ద్వారా తెలిపారు. జూలై 20వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషీ తన ట్వీట్‌లో తెలిపారు. పాత బిల్డింగ్‌లోనే వర్షాకాల సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్లమెంట్‌ ‌భవనంలో ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం ఉంది. అయితే సమావేశాలను సజావుగా సాగించేందుకు, ఫలప్రదమైన చర్చలను చేపట్టేందుకు విపక్షాలు కలిసి రావాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ఈ సమావేశాల్లో సత్ఫలితాలు ఇచ్చే చర్చలు జరగడానికి కృషి చేయాలని అన్ని పార్టీలను కోరారు. ఈ వర్షాకాల సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా దేశ రాజధాని నగరం ఢిల్లీ ప్రభుత్వ సవరణ ఆర్డినెన్స్‌కు చట్ట రూపం ఇచ్చేందుకు ఓ బిల్లును ప్రవేశపెట్టవచ్చు. కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించిన నేషనల్‌ ‌రీసెర్చ్ ‌ఫౌండేషన్‌ ‌బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు కొత్త పార్లమెంటు భవనంలో కార్యాలయాలను కేటాయించారు. ముఖ్యమైన డిపార్ట్‌మెంట్ల కార్యాలయాలను కూడా తరలిస్తున్నారు.ఈ ఏడాదికి చెందిన పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాల తేదీలను ఖరారు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *