ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యం
ఫజల్ అలీ కమిషన్ నివేదిక ప్రాతి పదికగా, తెలంగాణ, విశాలాంధ్ర వాద నేతల చర్చోప చర్చలు అనుమానాలు సందేహాలు నివృత్తి అనంతరం జూలై 19న పెద్దమనుషుల ఒప్ప ందం కుదిరింది. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుకు అనుకూలంగా మారింది. ఈ నేపద్యంలోకి వెళితే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రిటిషు పరిపాలనా కాల ంలో, మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నిటినీ ప్రెసిడెన్సీ నుండి విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలని కోరుతూ తెలుగు వారు ఉద్యమిం చారు. పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షతో ఉచ్ఛస్థాయికి చేరిన ఈ ఉద్యమం ఆయన మరణం తర్వాతనే సఫలీకృతమైంది. 1953 అక్టోబరు 1 న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మద్రాసు ప్రెసిడెన్సీ లోని తెలుగు భాష మాట్లాడే ప్రజలున్న భూభాగాన్ని వేరుచేసి దీన్ని ఏర్పరచారు.
1953 డిసెంబరులో సయ్యద్ ఫజల్ ఆలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్విభజన కమిషను ఏర్పాటయింది.1955 సెప్టెంబర్ 30 న తన నివేదిక సమర్పించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పా టును కమిషను సమర్ధించింది.
మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్ర లోను, కన్నడం మాట్లాడే ప్రాం తాలను కర్ణాటక లోను కలిపి తెలుగు మాట్లాడే ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యా లని సూచించింది. అయితే ఐదు సంవత్సరాల తరువాత రాష్ట్ర శాసనసభలో మూడింట రెండు వంతులు సభ్యులు ఒప్పుకుంటే, ఆంధ్రతో విలీనం చెయ్యవచ్చని కూడా సూచించింది. కమిషను సూచనలను ఆహ్వానించి, ప్రత్యేక రాష్ట్ర వాదనను సమర్ధించిన వారిలో కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి ప్రముఖులు. హైదరాబాదు శాసన సభలో అధిక శాతం సభ్యులు ఆంధ్ర ప్రదేశ్ను సమర్ధించారు. శాసనసభలో ఈ విషయంపై చర్చ జరిగినపుడు, 103 మంది సభ్యులు ఆంధ్ర ప్రదేశ్కు మద్దతు తెలుపగా, 29 మంది మాత్రమే వ్యతిరేకించారు. 15 మంది తటస్థంగా ఉండి పోయారు. ఆంధ్ర ప్రదేశ్ను సమర్ధించిన ప్రముఖ నాయకులలో అప్పటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణా రావు, మాడపాటి హనుమంత రావు, స్వామి రామానంద తీర్థ మొదలైనవారు ఉన్నారు. దీని నివేదికపై తెలంగాణ, విశాలాంధ్ర వాదులు తమతమ వాదనలను తీవ్రతరం చేసారు. కమ్యూ నిస్టులు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ, హైదరాబాదు శాసనసభకు రాజీనామా చేసి, ఈ విషయంపై ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. కాంగ్రెసు అధిష్ఠానం కూడా ఆంధ్ర ప్రదేశ్నే సమర్ధించి, ఆంధ్ర, తెలంగాణ నాయకులను తమ విభేదాలను పరిష్కరించు కొమ్మని ఒత్తిడి చేసింది. అయితే తెలంగాణ నాయకులకు తమ ప్రాంత అభివృద్ధిపై కొన్ని సందేహాలు ఉండేవి. అధిక రెవిన్యూ ఆదాయం గల తమ ప్రాంతం, అదే నిష్పత్తిలో అభివృద్ధికి నోచుకోదేమోనన్న భయం వారికి కలిగింది. ఇటువంటి ఇతర సందేహాల నివృత్తికై అన్ని ప్రాంతాల కాంగ్రెసు నాయకులు కలిసి 1956 ఫిబ్రవరి 20 న ఢిల్లీలో సమావేశ మ య్యారు. తెలంగాణ తరపున బూరుగుల రామ కృష్ణా రావు, కె.వి.రంగారెడ్డి (మర్రి చెన్నారెడ్డికి మామ. ఆయన పేరిటే 1978 లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రంగారెడ్డి జిల్లా ఏర్పాటయింది.), మర్రి చెన్నారెడ్డి, జె.వి.నర్సింగ్ రావు పాల్గొనగా, ఆంధ్ర తరపున బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ విధంగా అనేక చర్చలు, సంప్రదింపుల అనంతరం 1956 జూలై 19 న వారి మధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది.1956 నవంబర్ 1న అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భవించింది. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
పెద్ద మనుషుల ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవి: కనీసం ఐదేళ్ళపాటు, ప్రాంతాల వారీ రెవిన్యూ వసూళ్ళకు అను గుణంగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్య క్రమాలపై ఖర్చు పెట్టాలి. తెలంగాణ ప్రాంతం నుండి వచ్చే మిగులు ఆదాయాన్ని ఆ ప్రాంతపు అభివృద్ధికే కేటాయించాలి.
తెలంగాణలో విద్యాసంస్థలను అభివృద్ధి చెయ్యాలి. స్థానిక విద్యార్థులకు ప్రత్యేక రిజర్వే షనులు ఇవ్వాలి. సివిలు సర్వీసులకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకాలు జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలి. ఐదేళ్ళ పాటు పాలనా వ్యవస్థలోను, న్యాయ విభాగం లోను ఉర్దూ వినియోగం కొనసాగాలి. రాష్ట్ర మంత్రివర్గంలో నిష్పత్తి ప్రకారం సభ్యులు ఉండాలి. ముఖ్యమంత్రి కోస్తా, రాయలసీమ నుండి ఉంటే ఉప ముఖ్య మంత్రి తెలంగాణ నుండి, ముఖ్యమంత్రి తెలంగాణ వ్యక్తి అయితే ఉప ముఖ్యమంత్రి ఇతర ప్రాంతాల నుండి ఉండాలి. ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత తెలంగాణ అభివృద్ధి మండలికి ఉండాలి. మండలి సభ్యులు తెలంగాణ ప్రాం తం నుండి ఎన్నికైన శాసన సభ్యులు ఉండాలి.
తెలంగాణలో మధ్యపాన నిషేధాన్ని తెలంగాణ శాసనసభ్యులు కోరిన విధంగా అమలు చెయ్యాలి.తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాల్లో చేరేందుకు ఆ ప్రాంతంలో కనీసం 12 ఏళ్ళపాటు నివసి ంచి ఉండాలని నిబంధన రూపొ ందించాలి.కాబినెట్ మంత్రులలో 40 శాతం తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే ఉండాలి. ఆ ఒప్పందం తరువాత తెలంగాణ నాయకులలో ఉన్న సందేహాలు తొలగి, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
ఆ ఒప్పందాన్ననుసరించి 1956 నవంబర్ 1 న ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఒప్పందం అమలులో ఆంధ్ర నాయకులు చిత్తశుద్ధి ప్రదర్శించలేదు. విలీనానికి మరొక మార్గం కనిపించక పోవటంతో ఒప్పందం చేసుకున్నారే తప్ప, ఆ ఒప్పందం అమలుకు ఆసక్తి చూపలేదు. అసలు రాష్ట్ర ఆవిర్భావానికి ముందే ఒప్పందాల ఉల్లంఘన మొదలైంది.
పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణకు విస్తృతమైన అధికారాలుగల ప్రాంతీయ మండలి
ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఆ కమిటీ కేవలం సలహాలు మాత్రమే ఇవ్వగలదు. తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు తగ్గట్లు విధానాలు తయారుచేసే అధికారాలు దీనికి లేవు. తెలంగాణకు సంబంధించిన హక్కుల ఉల్లంఘన మొదటిదిగా ఇలా మొదలైంది. ఒప్ప ందం ప్రకారం ముఖ్యమంత్రి ఆంధ్రకు చెందిన వ్యక్తి అయినప్పుడు తెలంగాణ వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. అయితే, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అయిన నీలం సంజీ వరెడ్డి తెలంగాణ వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వటానికి నిరాక రించారు.పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం 1962 వరకు తెలంగాణ ప్రాంతానికి విడిగా కాంగ్రెస్ కమిటీ ఉండాలి. కానీ 1957లోనే తెలంగాణకు ఉన్న కాంగ్రెస్ కమిటీనికి రద్దుచేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో విలీనం చేశారు. దాంతో తెలంగాణ నుంచి నాయకత్వం ఎదిగే అవకాశం లేకుండా పోయింది.
సాగునీటి విషయంలో తెలంగాణ వెనుకబడి ఉన్నా రెండో పంచవర్ష ప్రణాళిక (1961-66) కాలంలో ఆంధ్ర ప్రాంతంలో సాగునీటి సౌక ర్యాలకు రూ.93.67 కోట్లు ఖర్చు చేయగా తెలంగాణలో కేవలం రూ.56.76 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. హైదరాబాద్ రాష్ట్రంలో ప్రతిపాదించిన ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహ రించింది. దేవునూరు, ఇచ్చంపల్లి ప్రాజెక్టులను పూర్తిగా రద్దుచేసింది. పోచంపాడు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులలో తెలంగాణకు తీరని అన్యా యం చేసింది. ఆంధ్రలో అవసరానికి మించి ఉద్యోగులు ఉన్నారని ముల్కీ నియమాలకు విరుద్దంగా వారిని తెలంగాణకు కేటాయించారు. స్థానికంగా అర్హులైన అభ్యర్థులు లేరన్న నెపంతో చాలామందిని స్థానికేతరులను నియమించారు. ఒకానొక సందర్భంలో 2500 మంది ఆంధ్ర ప్రాంతం వారిని తెలంగాణలో ఉపాధ్యాయులుగా నియమించారు.
పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం రాష్ట్ర, కేంద్ర, సాధారణ పరిపాలనా వ్యయానికి అయ్యే ఖర్చును ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు నిష్పత్తి ప్రకారం భరించాలి. ఈ ఖర్చు పోగా తెలంగాణ ఆదాయంలో మిగులును ఈ ప్రాంత అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలి. అయితే ఆంధ్ర పాలకులు తెలంగాణ మిగులు నిధులను తెలంగాణ కోసం ఖర్చు చేయకుండా దుర్వినియోగం చేశారు. పై విధంగా తెలంగాణ రక్షణల ఉల్లంఘన కారణంగా తెలంగాణ మనుగడ, అస్తిత్వం సంక్షోభంలో పడి 1969 తెలంగాణ ఉద్యమానికి దారితీసింది.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494




