ఆగ్రా,సెప్టెంబర్14 : అది బాల నేరస్తులు ఉండే జువెనైల్ హోమ్. అక్కడికి వచ్చే పిల్లలకు రక్షణ కల్పించడంతోపాటు, వాళ్లకు సంస్కారం నేర్పడం ఆ జువెనైల్ హోమ్ సూపరింటెండెంట్ బాధ్యత. కానీ ఆమె తీరు అందుకు భిన్నంగా ఉంది. పిల్లలపై ఆమె నిత్యం దాడులు చేస్తున్నది. వాళ్లను ఇష్టం వచ్చినట్లుగా కొడుతున్నది. తాజాగా ఓ బాలికను జువెనైల్ హోమ్ సూపరి ంటెండెంట్ పూనమ్ పాల్ చెప్పుతో విచక్షణా రహితంగా కొట్టింది. ఈ ఘటనకు సంబ ంధించిన దృశ్యాలు హోమ్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో సోమవారం వెలు గులోకి వచ్చింది. మంగ ళవారం అలాంటిదే మరో వీడియో బయట పడింది. ఆ వీడియోలో హోమ్ సూపరింటెండెంట్ పూనమ్ పాల్ ఓ బాలికను కాళ్లు, చేతులు కట్టేయించి ఓ మంచం పక్కనే పడేయించింది.
ఈ రెండు ఘటనలపై ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపారు. క్రూరంగా వ్యవహరిస్తున్న హోమ్ సూపరి ంటెండెంట్ పూనమ్ పాల్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. పూనమ్ పాల్ గతంలో ప్రయాగ్ రాజ్ జువెనైల్ హోమ్ సూపరి ంటెండెంట్గా పనిచే• •నప్పుడు కూడా పిల్లలపట్ల ఇంతే క్రూరంగా వ్యవహరించారని అధికారుల విచారణలో తేలింది. కాగా, పిల్లలపట్ల క్రూరంగా వ్యవహ రించినందుకు హోమ్ సూపరింటెండెంట్ పూనమ్పాల్తోపాటు ఆమెకు సహకరించిన హోమ్ సిబ్బందిని కూడా విధుల నుంచి తొలగించినట్లు ఆగ్రా డివిజన్ కమిషనర్ రీతూ మహేశ్వరి తెలిపారు.




