జి-20 లోగోలో కమలం గుర్తు ఎలా వాడుతారు?

కేంద్రాన్ని నిలదీసిన బెంగాల్‌ ‌సిఎం మమతా బెనర్జీ

న్యూఢిల్లీ,డిసెంబర్‌5 : ‌జి-20 సమ్మిట్‌లో కమలం పువ్వుగుర్తును వాడడంపై బెంగాల్‌ ‌సిఎం మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జీ20 అఖిలపక్ష సమావేశం జరగబోతుంది. ఆ సమావేశానికి హాజరుఅయ్యేముందు  పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డియాతో మాట్లాడుతూ, జీ20 సమ్మిట్‌, ‌గుజరాత్‌ ఎన్నికల గురించి సంచలన వాఖ్యలు చేశారు. ఎలక్షన్‌ ‌కమిషన్‌ ‌నిబంధనల ప్రకారం, ఓటింగ్‌ ‌రోజున రోడ్‌షోలకి ఎవరికీ అనుమతి లేదు.
కాదని ఎవరైనా ప్రచార కార్యక్రమాలు చేస్తే వాళ్లకి ఎన్నికల ఉల్లంఘన చట్టం ప్రకారం శిక్ష పడుతుంది. కానీ, గుజరాత్‌లోమాత్రం ప్రధాని మోడీ, ఆయన పార్టీ వీవీఐపీలు, కార్యకర్తలు ఏదైనా చేయొచ్చు. టింగ్స్ ‌పెట్టుకోవచ్చు. రోడ్డు షోలు జరుపుకోవచ్చు. ఈసీఐ వాళ్లను క్షమిస్తుంది‘ అని ఆరోపించారు. జీ20 సమ్మిట్‌, ‌లోగో వివాదంపై స్పందిస్తూ… ఇది రాజకీయ లబ్దికోసం ప్రధానమంత్రితో జరిగే టింగ్స్ ‌కావని గుర్తుచేశారు. కమలం పువ్వు జాతీయ పుష్పం అయినప్పటికీ, అది రాజకీయ పార్టీ లోగో కూడా.
కాబట్టి  కమలం పువ్వు గుర్తును జీ20 లోగోగా ఉపయోగించకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు. కమలం పువ్వుకి బదులు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాటిని ఎంపిక చేయొచ్చని సూచించారు. జీ20 లోగోకు కమలం పువ్వు గుర్తును ఉంచడంపై దేశంలోని చాలా పార్టీలు విమర్శిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *