జాతీయ పార్టీపై కెసిఆర్‌ ‌ముమ్మర కసరత్తు

  • దసరా నాటికి కొలిక్కి వొచ్చే అవకాశం
  • అదే రోజు పార్టీ ప్రకటనకు ఛాన్స్ అం‌టూ కథనాలు

హైదరాబాద్‌, ‌జాతీయ పార్టీకి సంబధించి సిఎం కెసిఆర్‌ ‌ముమ్మర్‌ ‌కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే పలు రాష్ట్రాల సిఎంలతో కలసి ముచ్చటించారు. అలాగే పలువురు నేతలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇటీవలే సిఎం KCR and Nithees Kumar కెసిఆర్‌ ‌నితీశ్‌ ‌కుమార్‌ ‌సహా రైతులతో వరుస భేటీ నిర్వహించారు. దీంతో పార్టీ ఏర్పాటులో వెనక్కి తగ్గేదిలేదన్న రీతిలో ఉన్నారు. దసరా రోజున తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌కొత్త జాతీయ పార్టీ ప్రకటన ఉండనుందనే ఊహాగానాలు ఎప్పటి నుంచో వినవస్తున్నాయి. దీని కోసం ఫామ్‌ ‌హౌస్‌ ‌వేదికగా కేసీఆర్‌ ‌కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తుంది. దసరా రోజునే టీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం జరగనుందని సమాచారం. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల ఏకాభిప్రాయంతో కేసీఆర్‌ ‌ప్రకటన చేయనున్నారని తెలుస్తుంది.

త్వరలోనే KCR plan for a huge public meeting భారీ బహిరంగ సభకు కేసీఆర్‌ ‌ప్లాన్‌ ‌చేయనున్నారు. ఈ బహిరంగ సభలోనే పార్టీ జెండా-ఎజెండాను కేసీఆర్‌ ‌ప్రకటించనున్నారని సమాచారం. ఇక పార్టీకి సంబంధించిన జెండా రూపకల్పన విషయంలో కూడా ఒక క్లారిటీ వొచ్చినట్టు తెలుస్తుంది. భారతదేశ చిత్ర పటంతో పాటు గులాబీ రంగు సైతం KCR National Party Name కేసీఆర్‌ ‌జాతీయ పార్టీ జెండాలో మిళితమై ఉంటుందని తెలుస్తోంది. ఇక పార్టీ ఎజెండా విషయానికి వొస్తే… రైతులు, దళితులు, యువతను టార్గెట్‌ ‌చేయనున్నట్టు సమాచారం. ఇప్పటి వరకూ తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ ‌వంటి సంక్షేమ కార్యక్రమాలను హైలైట్‌ ‌చేస్తూ కేసీఆర్‌ ‌తమ జాతీయ పార్టీని ముందుకు తీసుకువెళ్లనున్నట్టు సమాచారం. ఇక పార్టీ పేరు.. Bharata Rashtra Samithi ‘భారత రాష్ట్ర సమితి’ అని టాక్‌ ‌నడుస్తుంది కానీ క్లారిటీగా ఇదే అన్న విషయం మాత్రం తెలియడం లేదు. మొత్తానికి దసరాతో సస్పెన్స్ ‌వీడే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *