హైదరాబాద్, ఆగస్ట్ 26: తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ అవార్డులు దక్కడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తంచేశారు. విజేతలకు అభినందనలు తెలిపారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించిన అల్లుఅర్జున్ను సీఎం కేసీఆర్ అభినందించారు. తొలిసారిగా తెలుగు నటుడికి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ దక్కించుకున్న తొలి యాక్టర్‌గా బన్నీ చరిత్ర సృష్టించాడు.
అవార్డులు సాధించిన ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. రెండు రోజులక్రితం 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆరు అవార్డులు వచ్చాయి. మొత్తంగా తెలుగు సినిమాకు పదకొండు అవార్డులు దక్కాయి.




