జాతికి అంకితం కానున్న చర్లపల్లి టర్మినల్‌

98 శాతం పనులు పూర్తైన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ‌త్వరలో జాతికి అంకితం కానున్నది. దీనితో  హైదరాబాద్‌ ‌లోని ఈ శాటిలైట్‌ ‌టెర్మినల్‌ ‌తెలంగాణలో నాల్గవ అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించనున్నది.

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై18 : ఈ టెర్మినల్‌  ‌సికింద్రాబాద్‌, ‌కాచిగూడ రైల్వే స్టేషన్‌లలో ప్రస్తుతం ఉన్న రద్దీని తగ్గిస్తుంది. రూ. 434 కోట్లుతో నిర్మిస్తున్న ఈ స్టేషన్‌లో 19 కొత్త లైన్లతో పాటు అదనంగా 15 జతల రైళ్లను నిలిపే సౌకర్యం ఉన్నది. ఈ టర్మినల్‌ ‌తెలంగాణ రైల్వే అవసరాలను తీర్చడంలో ప్రముఖ పాత్ర పోషించనున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *