జయ జయహే తెలంగాణ!

తెలంగాణ ప్రాంతం శాతవాహన, కాకతీయ, చాళుక్య, ముఘల్‌, కుతుబ్‌ షాహీ, అసఫ్‌ జారీల రాజవంశాలు పాలించాయని చరిత్ర చెబుతున్నది. 250 బిసిఈ – 200 సిఈ కాలంలో శాతవాహనులు కృష్ణ గోదావరి నదుల మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని ఏలడం జరిగింది. 950 సిఈ – 1323 సిఈ వరకు   కాకతీయ రాజుల ఏలుబడిలో ఈ ప్రాంతం ఉండేది. 1323లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ సైన్యం కాకతీయుల ప్రధాన కేంద్రమైన వరంగల్‌ కోటపై దాడి చేసి, కాకతీయులను ఓడిరచి, 1687 వరకు ఢల్లీి సుల్తాన్‌ల ఏలుబడి సాగింది. 1712లో ఖుమారుద్దీన్‌ ఖాన్‌ దక్కన్‌ వైస్‌రాయ్‌గా నియమింపబడి, ‘నిజామ్‌-ఉల్‌-ముల్క్‌’ టైటిల్‌తో ముబారిజ్‌ ఖాన్‌ను ఓడిరచి దక్కన్‌ సభను ఏలడం ప్రారంభించారు. 1724 – 1948 వరకు అసఫ్‌ జాహీ రాజవంశస్థుల ఏలుబడులో పాలన జరిగింది.

తెలంగాణ విమోచనం
1769లో అసఫ్‌ జాహీ నిజామ్‌ వంశస్థులు హైదరాబాద్‌? కేంద్రంగా ఈ ప్రాంతాన్ని ఏలడం ప్రారంభించారు. 1799లో బ్రిటీష్‌ ప్రభుత్వంతో కలిసి పని చేయడంతో హైదరాబాద్‌? స్టేట్‌ విదేశాంగ, రక్షణ రంగాల్లో నిజామ్‌ అసఫ్‌ జాహీ-4 పట్టును కోల్పోయి, బ్రిటీష్‌ ఇండియాలో ‘‘ప్రిన్స్‌లీ స్టేట్‌’’గా మారింది. 1947లో భారత స్వాతంత్య్రం వచ్చిన తరువాత సర్దార్‌ వల్లబ్‌ భాయ్‌ పటేల్‌ చొరవ తీసుకొని చివరి నిజామ్‌ ఒస్మాన్‌ అలీ ఖాన్‌తో మాట్లాడి ఇండియన్‌ యూనియన్‌లో చేరమని కోరగా పలు మార్లు తిరస్కరించారు. 17 సెప్టెంబర్‌ 1948న ఇండియన్‌ ఆర్మీ దాడితో ఒస్మాన్‌ అలీ లొంగిపోయి,  నిజామ్‌ పాలన అంతమై హైదరాబాద్‌? రాష్ట్రం భారత్‌లో భాగమై, ఆ రోజు నుంచి ప్రతి ఏటా ‘తెలంగాణ విమోచన లేదా విముక్తి దినం’గా పాటించుట జరుగుతున్నది.

ఉమ్మడి రాష్ట్రంలో భంగపడ్డ తెలంగాణ
1953లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్‌ విభజన జరుగగా 01 నవంబర్‌ 1956న తెలుగు ప్రాంతాలు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు కలిసిపోయి ఆంధ్రప్రదేశ్‌గా ఆవిర్భవించడం జరిగింది. నాటి నుంచి ప్రారంభమైన ఆంధ్ర పాలకుల వివక్షాయుత నిర్ణయాలతో తెలంగాణ ప్రాంత అభివృద్ధి మందగంచడమే కాకుండా నిధులు, నియామకాలు, నీళ్లు ఆంధ్ర ప్రాంతానికి వరదలా పారడంతో తెలంగాణ నేలలన్నీ బీడు భూములుగా, పేదలు నిరుపేదలుగా రూవాంతరం చెందడం జరిగింది. ఈ నేపథ్యంతో గత ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం గళమెత్తిన, ఆంధ్ర పాలకులు అలక్ష్యం చేస్తూ అణిచి వేయడం జరుగుతూనే ఉండేది. మలి దశ ఉద్యమ వేడి తీవ్రత ఢల్లీికి తాకడం, నాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించడం వెంట వెంటనే జరిగి పోయాయి.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం
నాటి కాంగ్రేస్‌ వర్కింగ్‌ కమిటీ  01 జూలై 2013న తీసుకున్న తీర్మానం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించి, ఫిబ్రవరి 2014లో పార్లమెంట్‌లో రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రవేశ పెట్టడం జరిగింది. పలు దశాబ్దాల తెలంగాణ పౌర సమాజ పోరులో వందల, వేల ప్రాణాలు గాల్లో కలిశాయి. పార్లమెంట్‌ ఉభయ సభల్లో ‘ఆంధ్ర ప్రదేశ్‌ పునర్విభజన చట్టం-2014’ ద్వారా  02 జూన్‌ 2014న అధికారికంగా భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.

33 జిల్లాల తెలంగాణ
తెలంగాణ ప్రజలు నీళ్ళు, నిధులు, నియామకాల్లో వివక్షను వ్యతిరేకిస్తూ తీవ్ర పోరాట పటిమ చూపుతూ, ప్రజా సంఘాలు, తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమాల కారణంగా, నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అంగీకరించి 10 జిల్లాలతో కూడిన నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఏప్రిల్‌ 2014లో జరిగిన ఎన్నికల్లో 63 (119 సీట్లలో) సీట్లు గెలిచిన నాటి టిఆర్‌యస్‌ అధ్యక్షులు కె. చంద్రశేఖర్‌ రావు ప్రథమ ముఖ్యమంత్రిగా తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, 2019లో కూడా తిరిగి ఎన్నికై తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిడిపించే ముమ్మర ప్రయత్నాలను గత పదేళ్లుగా చేస్తున్నారు. రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు, రాష్ట్ర పుష్పంగా తంగేడ పువ్వు, రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్ర పక్షిగా పాలపిట్టలను మన సంస్కృతిలో భాగంగా గుర్తించడం జరిగింది. ‘‘జయ జయహే తెలంగాణ’’ను రాష్ట్ర గీతం, రాష్ట్ర నృత్యంగా ‘‘పేరిణి’’ని నిర్ణయించడంలో కేసిఆర్‌ విఫలం కావడం కొంత విమర్శకు దారి తీసింది.

2023 అసెంబ్లీ ఎన్నికలు – రేవంత్‌ ప్రభుత్వం ఏర్పాటు
తెలంగాణ అసెంబ్లీకి 30 నవంబర్‌ 2023న నిర్వహించిన ఎన్నికల్లో 65 సీట్లు కాంగ్రేస్‌కు (39.40 శాతం ఓట్లు), 39 సీట్లు బిఆర్‌ఎస్‌కు(37.35 శాతం ఓట్లు), 08 సీట్లు భాజపాకు(13.90 శాతం ఓట్లు), 07 సీట్లు ఎంఐఎంకు(2.22 శాతం ఓట్లు) దక్కడంతో రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రేస్‌ ప్రభుత్వం కొలువు తీరింది. కాంగ్రేస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 ప్రధాన హామీలను 100 రోజుల్లో అమలు పరచడానికి బలహీనంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ప్రతిబంధకంగా ఉన్నట్లు తోస్తుంది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రూ 500/-లకే గ్యాస్‌ అందించడం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు పథకాలు అమలు అవుతున్నది. రెండు లక్షల వరకు రైతు రుణాల మాఫీ, రైతులకు ఎకరానికి రూ 15,000/- నగదు సహాయం, భూమిలేని పేదలకు రూ 12,000/- అందించడం గృహ నిర్మాణానికి రూ 5 లక్షల ఆర్థిక సహాయం, వార్షిక జాబ్‌ క్యాలెండర్‌ విడుదల లాంటి పలు హామీలను వెంటనే అమలు పరచడానికి నిధుల కొరత అడ్డంకి కావచ్చు. పాలనకు తోడుగా కాంగ్రేస్‌ పార్టీలో ఉన్న అతి స్వాతంత్య్రం కూడా రేవంత్‌ రెడ్డికి దినదిన గండంగా మారవచ్చని విశ్లేషిస్తున్నారు.

పదేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనపై విమర్శలు
మేడిగడ్డ డ్యామ్‌ నిర్మాణంలో వచ్చిన పదుళ్లు, బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఉన్నతాధికారుల నేతృత్వంలో 1200ల వ్యక్తుల ఫోన్ల వరకు విచ్ఛలవిడిగా జరిరిన టాపింగ్‌ వ్యవహారం, వివిధ ప్రభుత్వ విభాగాల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలతో కెసిఆర్‌ను ఆత్మరక్షణలో పడేలా చేశాయి. గత దశాబ్దకాలంలో కెసిఆర్‌ నేతృత్వంలో జరిగిన కుటుంబ పాలన, మంత్రులకు సహితం స్వతంత్రత కొరవడడం, ప్రగతి భవన్‌ ప్రాంగణం గడీలను తలపించడం, సిఎం ప్రజలకు/ప్రభుత్వాధికారులకు అందుబాటు లో లేక పోవడం, ప్రభుత్వ ఖజానాను ఊడ్చి వేయడం, అతిగా సంక్షేమ పథకాలను ప్రాధాన్యం ఇవ్వడం లాంటి ఆరోపణలతో బిఆర్‌ఎస్‌ ఓటమిని చవిచూసిందని అర్థం అవుతున్నది.

రైస్‌ బౌల్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా
తెలంగాణ భూభాగం ఎత్తున ఉన్నందున సహజ నీటి ప్రవాహంతో జలాలు వ్యవసాయానికి అందుబాటులో ఉండేవి కావు. దీనిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వర ఎత్తిపోతల పథకం లాంటి కొన్ని తాగు – సాగు పథకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కోటి ఎకరాలకు సాగు నీరు, ప్రజలకు ఇంటింటికీ తాగు నీరు ఇవ్వడానికి భగీరథ ప్రయత్నాలు వడివడిగా జరిగాయి. ఆంధ్ర పాలకుల కాలంలో నెర్రెలు బారిన బీళ్లు నేడు జల ప్రవాహాలతో పచ్చటి తివాచీలు పరిచినట్లు, అత్యధిక ఆహారధాన్యాలను ఉత్పత్తి చేస్తూ, ‘రైస్‌ బౌల్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా’గా రూపాంతరం చెందడం తెలంగాణ ప్రజలకు గర్వకారణంగా ఉన్నది. ఉత్తర దక్షిణ భారతానికి వారధిగా తెలంగాణలో విభిన్న సంస్కృతులు గల ప్రజలు సుఖశాంతులతో నిత్య నూతనంగా శోభిల్లుచున్నది.

తెలుగు ప్రధాన భాషగా మాట్లాడే తెలంగాణలో హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడే ప్రజలు కూడా ఉన్నారు. తెలంగాణలో 40 శాతం పట్టణ జనాభా ఉండగా, 60 శాతం గ్రామీణ వ్యవసాయ ఆధారిత జీవనోపాధితో తెలంగాణ ప్రగతి పథంలో పరుగిడుతోంది.
సహజ వనరుల కేంద్రం తెలంగాణ  త్రిలింగ దేశం పుణాదిగా ఏర్పడిన తెలంగాణ ప్రాంతానికి మూడు శివ క్షేత్రాలు కాళేశ్వరరం, శ్రీశైలం, ద్రాక్షారామం హద్దులుగా ఉండేవి. దక్షిణ-మధ్య భారతదేశంలో ఉత్తరాన మహారాష్ట్ర, ఈశాన్యాన ఒడిసా, ఛత్తీస్‌ఘడ్లు, దక్షిణ – ఆగ్నేయాన ఆంధ్రప్రదేశ్‌, పడమర దిక్కున కర్నాటకలు పొరుగు రాష్ట్రాలుగా తెలంగాణ నూతన రాష్ట్రం హైదరాబాద్‌? కేంద్రంగా ఏర్పడిరది. సముద్ర మట్టానికి ఎత్తైన దక్కన్‌ పీఠ భూమిగా విస్తరించిన తెలంగాణ రాష్ట్రం గుండా గోదావరి, కృష్ణ అనబడే ముఖ్య జీవ నదులు ప్రవహిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రేస్‌ గెలిచింది అనే కన్న బిఆర్‌ఎస్‌పై ఎగిసిన ప్రజావ్యతిరేకత మాత్రమే రేవంత్‌ను సిఎంగా చేసిందనడంలో అతిశయోక్తి లేదు.

సుస్థిరాభివృద్ధి దిశగా తెలంగాణ
హౖదరాబాద్‌.. మహానగరం దేశంలోనే ముఖ్యమైన నగరాల్లో ఒకటిగా ‘దక్షిణ భారత కాపిటల్‌’గానే కాకుండా 20 ప్రపంచ మహానగరాల జాబితాలో 2వ స్థానంలో చోటు దక్కించుకొని పేరుగాంచింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌? జంట నగరాలు విడిదీయరాని అనుబంధాన్ని పెనవేసుకొని శాంతి భద్రతలు కలిగిన భాగ్యనగరంగా వర్దిల్లుతున్నది. 3.98 కోట్ల జనాభా కలిగిన తెలంగాణలో హిందువులు అధిక శాతం ఉండగా, ప్రధాన మైనారిటీ జాబితాల ముస్లిమ్‌, సిక్కులు, క్రిస్టియన్లు కూడా ఉన్నారు.

వ్యాక్సీన్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా
ఐటి, ఫార్మారంగాలకు పుట్టినిల్లుగా, ‘వ్యాక్సీన్‌ కాపిటల్‌ ఆఫ్‌ ఇండియా’గా, పారిశ్రామిక ప్రగతిలో అగ్రభాగాన తెలంగాణకే హైదరాబాదు గుండెకాయగా విస్తరిస్తున్నది. బతుకమ్మలో పెర్చిన సప్తవర్ణ పూలవలె తెలంగాణలో విభిన్న కులమతాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిపోయి శాంతియుత సహజీవనం చేయడం సంతోషదాయకం.

పంట రుణాల మాఫీ, సాగు నీటి ప్రాజెక్టులు, నిరంతర విద్యుత్‌ సరఫరా, రైతు బంధు, భూ రికార్డుల ప్రక్షాళన, ఐకెపి సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు, వృద్ధాప్య/వితంతు/కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్‌ లాంటి ఆర్థిక చేయూతలను ఇచ్చే అనేక విలక్షణ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదరికాన్ని జయించే మహాయజ్ఞంలో తెలంగాణ ముందున్నది.

సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధి
సంక్షేమ పథకాల అమలు మాత్రమే అభివృద్ధి కాదని, వీటితో ఒక రోజు ఆకలి తీరుతుందని గమనించాలి. రాష్ట్ర సుస్థిరా భివృద్ధి దిశగా నడిస్తే ప్రజలు ప్రతి రోజు సుఖసంతోషాలతో జీవించగలుగుతారనే విషయాలను పాలకులు గుర్తుంచుకోవాలి. ఓటు బ్యాంకు రాజకీయాలకు ఏ పార్టీలు, ప్రభుత్వాలు మినహాయింపు కాదు. నేడు అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల మధ్య సమతుల్యత రావలసి ఉంది.తాత్కాలిక ప్రయోజనాలకు ప్రజలను అలవాటు చేయకుండా, దీర్ఘ కాలిక ప్రయోజనాలకు ప్రభుత్వాలు పట్టం కట్టాలి. గత 10 సంవత్సరాలుగా సాధించిన ప్రగతిని మననం చేసుకుంటూ, అసలైన సుస్థిరాభివృద్ధి పథకాలకు పుణాదులు వేసి తెలంగాణ రాష్ట్రాన్ని ‘ఓనర్స్‌ ప్రైడ్‌ అండ్‌ నైబర్స్‌ ఎన్వీ’గా ఇతర రాష్ట్రాలకు ఈర్ష్యను కలిగించేలా, వడి వడిగా ముందడుగు వేయాలని కోరుకుందాం.
నేడు చర్చలకు దారితీస్తున్న తెలంగాణ రాష్ట్ర గీతం పట్ల నిర్ణయానికి రావడం హర్షదాయకం. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో జరగాల్సిన మార్పుల విషయాల్లో తొందరపడకుండా మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు పట్టం కట్టడం జరగాలి. జిల్లాలను కుదించడం, ఖజానాను పూర్తిగా సంక్షేమ పథకాల అమలుకు వినియోగించడం లాంటి విషయాల్లో రేవంత్‌ జట్టు కొంత సమయం తీసుకొని ఆచి తూచి అడుగులు వేయాలని, సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధి కూడా సమాంతరంగా జరగాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.
-డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి
కరీంనగర్‌,
9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *