జగదేవ్ పూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: జగదేవపూర్ మండల కేంద్రంలోని మెడల్ స్కూల్ లో తొమ్మిది వ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెగ్యులర్ కోర్సు లతో పాటు ఒకేషనల్ కోర్సులో ఫ్యాషన్ డిజైనింగ్, మీడియా ఎంటైన్మెంట్ కోర్సులతో శిక్షణ ఇస్తున్నారని ప్రిన్సిపాల్ కే. స్లివరాజు, ఒకేషనల్ టైనర్ సోమ లక్ష్మి వృత్తి విద్యా కోర్సు ట్రైనర్ అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..వృత్తి విద్యా కోర్సులలో భాగంగాఅక్టోబర్ 12వ తేదీ నుండి అక్టోబర్ 21వరకు పది రోజుల పాటు ఇంటర్నెట్ పీస్ ప్రోగ్రామ్ కోసం ఫ్యాన్ డిజైన్ మరియు మీడియా కోర్సు చదువుతున్న విద్యారులు జగదేవపూర్ మండల కేంద్రంలో ఉన్నా యస్ వి సిల్క్ షాపింగ్ మాల్, తడక లక్ష్మి టైలరింగ్ మరియు అమ్మ డిజిటల్ లలో శిక్షణ పొందుతున్నారాని తెలిపారు.అదేవిధంగా విద్యాతో పాటుగా వృత్తి విద్యా కోర్సులు, వారికీ ఆత్మస్థైర్యం క్రమ శిక్షణ నిజ జీవితంలో ఉపాధి అవకాశాలు పోoదవచ్చని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమం లో బీ. కళ్యాణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జగదేవపూర్ మాడల్ స్కూల్ లో వృత్తి విద్యా కోర్సుల శిక్షణ




