కొరోనా మలి విజృంభణతో
అగ్రజున్నని విర్రవీగిన చైనా
పసికూనలా వణుకుతుంది
తలొగ్గేదే లేదన్న డ్రాగన్
తలొంచి మోకరిల్లుతుంది
పటిష్టమేనన్న బీజింగ్
పునాదితో కూలుతుంది
తను పుట్టించిన కొరోనా
తననే మట్టి కరిపిస్తుంది
తను రాజేసిన మంటల్లో
తానే తగలబడిపోతుంది
ఇపుడు దేశం అంతటా
ప్రాణాలు రాలుతున్నయ్
పీనుగలు పోగవుతున్నయ్
చితి సెగలు రగులుతున్నయ్
అశ్రు నదులు పొంగుతున్నయ్
మొత్తంగా అతిపెద్ద చైనా దేశం
అస్తిత్వం ప్రశ్నార్థకం అయింది
ఏది ఏమైనా…
ఎవరు తోడుకున్న గోతిలో
వారే పడతారనే నానుడికి
చైనా నిదర్శనమై నిలిచింది
మానవతులుగా మనం
అక్కడి ప్రజానికం మరలా
కోలుకోవాలని కోరుకుందాం
చైనా దేశ తలబిరుసు తగ్గి
బుద్దిగ ఉంటుందని ఆశిద్దాం
అంతిమంగా..
మనమందరం సమైక్యమై
కొరోనా విరోధిని తరిమేద్దాం
మనిషే విజేతని చాటుదాం
(కొరోనా తాకిడి కుదేలైన చైనాకు బాసటగా..)
– కోడిగూటి తిరుపతి 9573929493




