ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 25: చేవెళ్ల మండల కేంద్రంలో ఆశా కార్యకర్తల రాష్ట్ర వ్యాప్త సమ్మె ప్రారంభం అయ్యిందని సిఐటియు నాయకులు అల్లి దేవేందర్ అన్నారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దేవేందర్ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశాలకు ఇస్తున్నటువంటి పారితోషకాలను 18 వేలకు పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని దేవేందర్ అన్నారు.ఆశా కార్యకర్తలకు ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రమాద బీమా ఐదు లక్షల ఇవ్వాలని ఆశలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలని సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని తదితర డిమాండ్లతో ఆశా కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నారు అని సిఐటియు జిల్లా సహాయక కార్యదర్శి అల్లి దేవేందర్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తల చేవెళ్ల మండల అధ్యక్షులు కార్యదర్శులు అన్నపూర్ణ,విజయలక్ష్మి,షాబాద్ మండల అధ్యక్షులు కార్యదర్శులు కృష్ణవేణి,మాధవి,చందనవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నాయకురాలు లలిత,మండల సలహాదారురాలు ధనలక్ష్మి,షాబాద్ చేవెళ్ల మండలాల ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.




