చేపల వేటకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవద్దు: పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 28: జిల్లాలో నిండిన వాగు వంకలలో చిన్నచిన్న కుంటలలో ఉధృతంగా నీటి ప్రవాహం ఉన్నందున ఎవరు కూడా ప్రజలు అక్కడికి వెళ్ళవద్దని, ఎక్కడపడితే అక్కడ చేపలు పట్టడానికి ప్రజలు వెళుతున్నారు. లోతు తెలవకుండా తెలియని ప్రదేశాలకు వెళ్లి చేపలు పట్టడానికి వెళ్లి ప్రాణాలు విలువైన ప్రాణాలు కోల్పోవద్దని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత సూచించారు.పోలీస్ అధికారులు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాలలో వాగులు వంకలు ప్రాజెక్టులు కల్వర్టు నిండి ఉధృతంగా ప్రవహిస్తున్నందున చేపలు పెట్టడానికి వెళుతున్న వారిపై నిఘా ఉంచాలని, నీటి ప్రవాహానికి కొట్టుకొని పోయి ప్రాణాలు పోయే అవకాశం ఉన్నందున ఎవరిని కూడా నీటి దగ్గరికి వెళ్లకుండా చూడాలని అధికారులకు సూచించారు.ప్రజలు వాహనదారులు పోలీసుల సూచనలు సలహాలు పాటించి నీటి ప్రవాహానికి దూరంగా ఉండాలని, విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దని కమిషనర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *