ఆమనగల్లు పురవీరుల గుండా భారీ ర్యాలీ
ఆమనగల్లు ప్రజాతంత్ర సెప్టెంబర్ 17 : ఆమనగల్లు పట్టణాన్ని చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దడంలో మనందరం భాగస్వాములు కావాలని ఆమనగల్ మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, చైర్మన్ రాంపాల్ నాయక్ అన్నారు. ఆదివారం ఇండియన్ స్వచ్ఛత లీగ్ 2.0 లో భాగంగా సుర సముద్రం చెరువు పై నడుస్తూ చెత్త తొలగింపు కార్యక్రమంలో చైర్మన్ నేనవత్ రాంపాల్ నాయక్, కమిషనర్ శ్యామ్ సుందర్, వైస్ చైర్మన్ భిమనపల్లీ దుర్గయ్యలు పాల్గొన్నారు. పరిశుభ్రమైన మరియు చెత్తరహిత పట్టణం కొరకై ఇండియన్ స్వచ్ఛత లీగ్ 2.0 లో భాగంగా స్వచ్ఛ అమనగల్లు కొరకై మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు వార్డు ల లో తిరుగుతూ చెత్తను తొలగించే గొప్ప కార్యక్రమం నిర్వహించటం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా పట్టణాల్లో సైతం నడుస్తూ చెత్త తొలగింపు కార్యక్రమం నిర్వహించారన్నారు. సుర సముద్రం చెరువు నీటిలో కొట్టుకు వచ్చిన వాటర్ బాటల్స్, చెప్పులు, కవర్ లను తొలగించారు. ఇలాగే మీ నివాస ప్రాంతాలలో సైతం చెత్త రహితంగా ఉండటానికి బయట చెత్తను తొలగించాలన్నారు. పట్టణ ప్రజలకు దోమల వలన మలేరియా, డెంగ్యూ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఇటీవల 2 ఫాగింగ్ మిషన్ లు సైతం కొనుగోలు చేసి పట్టణంలో ఫాగింగ్ చేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, మునిసిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.




