హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : ముచ్చింతల్ లోగల చినజీయర్ స్వామి ఆశ్రమంలో సమతా మూర్తి పేరిట ప్రపంచంలోనే రెండవ ఎత్తైన విగ్రహాన్ని నెలకొల్పిన శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామికి భారత్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షుడు లయన్ కెవి.రమణారావు భారత్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేసిన ధృవపత్రాన్ని అందజేశారు. అహోబిల జీయర్ స్వామి, సత్యనారాయణ స్వామి, భారత్ ఆర్ట్స్ అకాడెమీ అధ్యక్షురాలు లయన్ లలితారావు, నటుడు వేణు తదితరుల సమక్షంలో అందజేశారు. భవిష్యత్ తరాలకు శ్రీశ్రీశ్రీ రామానుజాచార్య కీర్తిని చాటేలా సమాజంలో సమానత్వం కొనసాగేలా పద్మశ్రీ, పద్మభూషణ్ శ్రీ చినజీయర్ స్వామిజీ చేసిన కృషిని అభినందిస్తూ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహాన్ని నెలకొల్పిన గొప్ప సమతమూర్తిగా శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి పేరుని భారత్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేసిన ధ్రువపత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరశర్మ, ఉమామహేశ్వరరావు, చలపతి రెడ్డి, సుదర్శన్ గుప్త, లక్ష్మణ్, దయాకర్, లింగస్వామి, మణికంఠ, మురళి తదితరులు పాల్గొన్నారు.




