చిక్కుల్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌

న్యూయార్క్, ‌మార్చి 31 : అమెరికా  మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌  ‌చిక్కుల్లో పడ్డారు. ఆయనపై  నేరారోపణలను రుజువైనట్లు  న్యూయార్క్ ‌గ్రాండ్‌ ‌జ్యూరీ  ధృవీకరించింది. దీంతో అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఇలా నేరారోపణలు ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడిగా ట్రంప్‌  ‌నిలిచారు. డొనాల్డ్ ‌ట్రంప్‌ 2016‌లో ఎన్నికల ప్రచారంలో పోర్న్ ‌స్టార్‌ ‌స్ట్రో డానియల్స్ ‌తో తనకున్న శారీరక సంబంధం బయటపడకుండా  ఆమెకు  డబ్బు చెల్లించి ఒప్పందం చేసుకున్నారని ట్రంప్‌ ‌పై అభియోగాలు ఉన్నాయి. ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ ఆమె 2018లో  కోర్టును ఆశ్రయించింది.  అయితే ట్రంప్‌ ఈ ఆరోపణలను అప్పట్లో  కొట్టిపారేశారు.

2024లో మరోసారి అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోన్న తనపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అయితే పోర్న్ ‌స్టార్‌ ‌తో డబ్బు చెల్లింపులపై ట్రంప్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన పర్సనల్‌ ‌లాయర్‌  ‌మైఖేల్‌ ‌కోహెన్‌ ‌తెలిపారు. ట్రంప్‌  అధ్యక్ష పదవిలో ఉండటంతో హైప్రొఫైల్‌ ‌కేసుగా దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. తనను అరెస్ట్ ‌చేసేందుకు రంగం సిద్ధమవుతోందని ,ఆందోళనలకు సిద్ధం కావాలని ట్రంప్‌ ఈ ‌మధ్య తన అనుచరులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే న్యూయార్క్ ‌కోర్టు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌పై నేరారోపణలను దృవీకరించింది. మరీ ట్రంప్‌ ‌ను ఈ కేసులో అరెస్ట్ ‌చేస్తారా? లేక విచారిస్తారా? ట్రంప్‌ ‌లొంగిపోతాడా? అనేదానిపై చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *