చింతలపల్లి లో బతుకమ్మ చీరల పంపిణీ

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 4 :  ముఖ్య మంత్రి  కెసిఆర్ ఎంతో ప్రతిష్టత్మకంగా  దసరా కానుకగా ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆమనగల్ మండల వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో మహిళలకు గ్రామ సర్పంచ్ మంజులతో కలిసి చీరలను పంపిణి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్లు బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పొనుగోటి అర్జున్ రావు, యాదమ్మ, ఈరమ్మ, బాలమైసమ్మ, ఎల్లమ్మ, రాములమ్మ, జంగమ్మ, సాయమ్మ, అంతమ్మ, గ్రామ పెద్దలు, నాయకులు కుమార్, నరేందర్, బాలరాజు, జంగయ్య, విజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *