చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం

  • ఈ వయసులో అరెస్టు చేయడం మంచిది కాదు
  • బాబు అరెస్టుపై స్పందించిన మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టుపై భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) ‌పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పందించారు.శనివారం సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెట్ట గ్రామ శివారులో ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో రూ.300 కోట్ల పెట్టుబడితో చేపట్టిన పామాయిల్‌  ‌ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..  బాబు అరెస్టు దురదృష్టకరమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాపం ఈ వయసు(73)లో చంద్రబాబును అరెస్టు చేయడం మంచిది కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఎనకటికి చంద్రబాబు ఐటి, ఐటి అనేవాడు.

ఇప్పుడు మాత్రం ఒక మంచి అన్నాడు. ఐటి, ఐటి అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిపై మంచి మాటలు చెప్పారు. ఒకప్పుడు ఆంధ్రలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనే పరిస్థితులు ఉండే, ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు వొస్తుందని స్వయంగా చంద్రబాబు అన్నారంటూ మంత్రి హరీష్‌రావు గుర్తు చేశారు. ఇలా జరగడానికి రాష్ట్రంలో కేసీఆర్‌ ‌మంచి పాలనతోనే సాధ్యమైందన్నారు. కేసీఆర్‌ ‌సిఎం అయ్యాక రాష్ట్రంలోని రైతాంగాన్ని బాగు చేసిండనే చంద్రబాబు అలా అన్నాడనీ మంత్రి హరీష్‌రావు చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *