కీసర, ప్రజాతంత్ర , డిసెంబర్ 09 : దమ్మాయిగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దమ్మాయిగూ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కలను సహకారం చేసిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అని కొనియాడారు. దశాబ్దాల కల కేవలం సోనియాగాంధీ వల్లనే సాధ్యమైందని తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న గొప్ప త్యాగమూర్తి అని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దమ్మాయిగూడ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి ఏనుగు సంజీవరెడ్డి, మహిళా అధ్యక్షురాలు జూపల్లి శోభారాణి కృష్ణారావు, యూత్ అధ్యక్షుడు సుమేష్, కాంగ్రెస్ నాయకులు రామారావు వెంకటేష్ గౌడ్, డొంకెన భాస్కర్ గౌడ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు




