ప్రజాతంత్ర కోడంగల్ ఆగస్ట్ 18: దళిత, బహుజనుల సంక్షేమం, రాజ్యాధికారం కోసం కృషి చేసిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న అని ఆయన వీరత్వాన్ని కొనియాడుతూ దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకించి దళిత బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడిన మహనీయుడు పాపన్నను స్మరించుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు ఈడిగి అశోక్ గౌడ్ సాయిలు గౌడ్ వెంకటయ్య గౌడ్ నర్సింలు గౌడ్ గ్రామ పెద్దలు తెరాస మండల పార్టీ అధ్యక్షులు ప్రమోద్ రావు దూది లింగప్ప ఎంపీటీసీ బసంతమ్మ వెంకటప్ప తెరాస నాయకులు దస్తప్ప దూది వీరేందర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సపెట్ల శ్రీనివాస్ బాజర్ల చంద్రప్ప నక్క వెంకటేష్ యువకులు వెంకటేష్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ అశోక్ గౌడ్ వెంకటేష్ గౌడ్ అయ్యప్ప గౌడ్ శ్యాంసుందర్ గౌడ్ మల్లేష్ గౌడ్ మహేష్ గౌడ్ వార్డు మెంబర్లు ఆశప్ప తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.



