ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 28 : జాతీయ కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఆమనగల్లు, కడ్తాల పట్టణంలో మండలాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, టీపీసీసీ సభ్యులు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షుడు తెల్గమల్ల జగన్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేకు కట్ చేసి కార్యకర్తలకు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మానయ్య, మాజీ మండల అధ్యక్షుడు మండ్లి రాములు,  యూత్ కాంగ్రేస్ జిల్లా కార్యదర్శి కృష్ణ నాయక్, జిల్లా నాయకులూ వస్పూల శ్రీశైలం, అబ్దుల్ ఖాదర్, కాలే మల్లయ్య, బాబా, సురేష్ నాయక్, ఆసిఫ్ అలీ, జహంగీర్ అలీ, జహంగీర్ బాబా,  కల్వకుర్తి జనరల్ సెక్రటరీ అలీం, శ్రీనివాస్ రెడ్డి యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వస్పూల శ్రీకాంత్, సోషల్ మీడియా మండల కన్వీనర్ నాజర్, ఎన్ఎస్ యూ ఐ మండల అధ్యక్షుడు ఫరీద్, ప్రసాద్, శీను, కొండల్, రవీందర్ నాయక్, ఖాదర్ ఖాద్రి, రాజు, సురేష్, అశోక్, జంతుక యాదయ్య, రవి, మైసయ్య, జాలాల్, చత్రు మరియు కాంగ్రెస్ నాయకులూ, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *