ఘణంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు 

కుల్కచర్ల, ప్రజాతంత్ర అక్టోబర్,02: మహాత్మా గాంధీ జయంతి వేడుకలను మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో కుల్కచర్ల మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ పాత్ర మరువలేనిది సత్యం,అహింస అనే వాటిని ఆయుధాలుగా మలచుకొని ఆంగ్లేయులపై పోరాటం కొనసాగించారు తద్వారా భారత దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టాడన్నారు.భారతదేశ స్వతంత్ర పోరాటంలో గాంధీజీ పోరాటానికి ఆయనకు మహాత్మ,జాతిపిత,బాపూజీ వంటి బిరుదులతో గౌరవించారన్నారు.గాంధీజీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో  మాజీ సర్పంచ్ జానకిరామ్, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు నవీన్ కుమార్, మాజీ అధ్యక్షుడు సతీష్ కుమార్, వెంకటేష్, నర్సింలు, సత్యనారాయణ, సుభాష్ ,సంతోష్, కుమార్, శ్రవణ్ కుమార్, రవిశంకర్, పుల్లయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *