‌గ్రూప్‌-2 ‌పరీక్ష వాయిదా వేయాలి

  • తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కార్యలయం వద్ద ఉద్రిక్తత
  • అభ్యర్థుల ఆందోళన-కార్యాలయ ముట్టడితో భారీగా  ట్రాఫిక్‌ ‌జామ్‌
  • ఆం‌దోళనకారునలు అరెస్ట్ ‌చేసిన పోలీసులు
  • వాయిదాను పరిశీలిస్తామని తెలిపిన కమిషన్‌

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్10: ‌గ్రూప్‌-2 అభ్యర్థుల ర్యాలీ,ఆందోళనలతో ప్రభుత్వం దిగివచ్చింది.  గ్రూప్‌ 2 ‌వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌పై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌స్పందించింది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ అం‌దుబాటులో లేనందున కార్యదర్శి ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థుల డిమాండ్‌లను పరిశీలిస్తామని తెలిపారు. వరుసగా వస్తున్న పోటీ పరీక్షలకు ప్రిపేర్‌  అయ్యే టైం లేదని డిమాండ్‌ ‌చేస్తూ గ్రూప్‌ 2 అభ్యర్థులు తెలంగాణ స్టేట్‌ ‌పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌కార్యాలయాన్ని ముట్టడించారు. ఈనెల 29, 30న జరిగే గ్రూప్‌ 2 ‌పరీక్షను వాయిదా వేయాలని కోరారు.  టీఎస్‌పీఎస్సీ ఆఫీస్‌ ‌ముట్టడికి యత్నించిన అభ్యర్థులతో నాంపల్లి పరిసర ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. భారీగా వచ్చిన అభ్యర్థులు వారికి మద్దతు పలికిన రాజకీయా పార్టీల అనుచరులతో ఆప్రాంతం ఒక్కసారిగా వేడెక్కింది. ఆ రూట్‌లో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ ‌జామ్‌ అయింది. దీంతో కొందరు అభ్యర్థులను పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లి పోయారు. రాజకీయ పార్టీల నాయకులను కూడా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. దీన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తూ పోలీసులతో ఘర్షణకు దిగారు.

పరిస్థితి మరింత తీవ్రంగా మారడంతో టీఎస్‌పీఎస్సీ అధికారులు స్పందించాల్సి వచ్చింది. భారీగా తరలివచ్చిన అభ్యర్థులతో తెలంగాన పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.  గ్రూప్‌-2 ‌పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ టిఎస్పిఎస్‌ ‌ముట్టడికి అభ్యర్థులు పిలుపునిచ్చారు. దీంతో నాంపల్లిలోని టిఎస్పిఎస్‌ ఆఫీస్‌ ‌వద్దకు భారీగా అభ్యర్థులు తరలివచ్చారు. గ్రూప్‌-2 ‌పరీక్షను వాయిదా వేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. టిఎస్పిఎస్‌ ‌కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మొహరించారు. టిఎస్పిఎస్‌ ‌ముట్టడించేందుకు ప్రయత్నించిన అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌ ‌కు తరలించారు. గ్రూప్‌-2 అభ్యర్థులకు కోదండరామ్‌, ‌యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌లీడర్‌ ‌బల్మూరి వెంకట్‌ ‌మద్దతు తెలిపారు. అరెస్టు చేసి విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని బల్మూరి వెంకట్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. అభ్యర్థులది న్యాయమైన డిమాండ్‌ అని కొదండరామ్‌ అన్నారు. కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న అభ్యర్థులకు నాయకత్వం వహిస్తున్న కొందరు నాయకులను పిలిచి మాట్లాడారు. వారితో చర్చించి పరిస్థితి వివరించారు. వారిని శాంతింపజేసి అక్కడి నుంచి పంపేశారు. విద్యార్థులతో మాట్లాడిన అనంతరం టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్‌ ఓ ‌ప్రకటన విడుదల చేశారు.

అభ్యర్థుల నుంచి వినతిపత్రం తీసుకున్నామని అందులో తెలిపారు. వారి విన్నపాలను పరిశీలిస్తామన్నారు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి రెండు రోజుల సమయం పడుతుందని వివరించారు. ప్రస్తుతానికి గ్రూప్‌ 2 ‌పరీక్ష వాయిదా పడలేదని స్పష్టం చేశారు అనిత రామచంద్రన్‌. ‌దీనిపై టీఎస్‌పీఎస్‌సీ స్పష్టమైన ప్రకటన చేస్తుందని అంత వరకు తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని అభ్యర్థులకు సూచించారు. గ్రూప్‌ 2 ‌పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు తెలంగాణ స్టేట్‌ ‌పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌కార్యాలయాన్ని చుట్టుముట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థులకు ఓయూ జేఏసీ, టీపీసీసీ, టీజేఎస్‌ ‌మద్దతు తెలిపాయి. టీఎస్‌పీఎస్సీ ఆఫీస్‌ ‌ముట్టడికి వేలాదిగా విద్యార్థులు, అభ్యర్థులు తరలి వచ్చారు. కార్యాలయం ముందు బైఠాయించారు. ప్రిపరేషన్‌కు తమకు టైం సరిపోవడం లేదని అందుకే గ్రూప్‌ 2 ‌పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్‌ ‌చేశారు.

విద్యార్థులతో మాట్లాడిన అధికారులు చర్చలకు ఆహ్వానించారు. విద్యార్థి సంఘాలను ఆఫీస్‌లోకి పిలిచి వారితో చర్చించారు. ప్రస్తుతానికి ఆందోళన విరమించాలని వారికి సర్ది చెబుతున్నారు. ఒకేసారి అన్ని నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రభుత్వం తమకు ప్రిపేర్‌ అయ్యే టైం కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఇప్పటికే వివిధ రాజకీయపార్టీల మద్దతు కోరాయి. ప్రతిపక్షాలన్నీ కూడా వారికి మద్దతు ప్రకటించాయి. ప్రస్తుతం చేపట్టిన ఆందోళలో కాంగ్రెస్‌, ‌టీజేఎస్‌ ‌కూడా పాల్గొనడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ ‌జామ్‌ అయింది. ప్రస్తుతం తెలంగామలో గురుకుల, జేఎల్‌, ‌డీఎల్‌ ‌పరీక్షలు జరుగుతున్నాయి. వచ్చే నెలలో టెట్‌ ఉం‌ది. ఈలోపే అంటే ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌ 2 ‌పరీక్ష రాయాల్సి ఉంది. వరుస ఈ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులకు గ్రూప్‌ 2 ‌పరీక్ష ప్రిపేర్‌ అయ్యేందుకు సమయం సరిపోదని అందుకే వాయిదా వేయాలని కోరుతున్నారు అభ్యర్థులు. గ్రూప్‌ 2 ‌పోస్టులకు 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *