షాద్ నగర్ ప్రజా తంత్ర ఆగస్ట్1 :బిఆర్ఎస్ పాలనను గద్దెదించే సమయం ఆసన్నమైందని, గ్రామాల్లో కార్యకర్తలు చురుకుగా కదలాలని ప్రజలను చైతన్యం చేసే దిశగా వారిని కదిలించాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. నియోజక వర్గంలోని కేశంపేట మండలం తొమ్మిది రేకుల, లింగంధన గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షుడు గూడెం వీరేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ముఖ్య కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అధికార పార్టీ నాయకులు ప్రలోభ పెట్టిన, బెదిరింపులకు గురిచేసినా అదరకుండా, బెదరకుండా ముందుకు సాగాలని.. కార్యకర్తల వెన్నంటే పార్టీ ఉంటుందని అభయం ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వరప్ప, పిసిసి మెంబర్ బాబర్ ఖాన్, ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘు, మహిళా అధ్యక్షురాలు అనసూయ, కేశంపేట మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, బీసీ సెల్ రావుల పెంటయ్య, కిసాన్ సెల్ కే రాములు, ఎస్టీ సెల్ రూపుల నాయక్, మైనార్టీ సెల్ సంగేమ్ ఇబ్రహీం, ఎస్సీ సెల్ నాగిళ్ల భాస్కర్, యూత్ కాంగ్రెస్ భాస్కర్, లింగంధన మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రాములు, నరసింహారెడ్డి, ఉపసర్పంచులు రమేష్, ఆంజనేయులు, పర్వతాలు, గ్రామ నాయకులు కరుణాకర్ రెడ్డి, నరసింహారెడ్డి, లాలమోని చంద్రయ్య, రాఘవేందర్, జి శేఖర్, నర్సింలు, ప్రకాష్ గౌడ్, పాపిరెడ్డి గూడా నర్సింలు, దేవేందర్, గ్రామ మహిళలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు




