గ్రామాల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు మరింత చేరువయ్యేలా కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ ఎంపీపీ కామిడీ చంద్రకళ కమల్ రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆనంద్ పాల్గొని మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో గ్రామాల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధిలో తీర్చిదిద్దుతూ ఆదర్శంగా నిలపడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను గ్రామాల్లో త్వరగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. హరితహారంలో నాటిన మొక్కలను సరైన విధంగా సంరక్షించి కాపాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *