జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: జగదేవపూర్ మండల పరిధిలోని అనంతసాగర్,చిన్నకిష్టాపూర్,వట్టిపల్లి, బస్వాపూర్, జగదేవపూర్, పీర్లపల్లి, నిర్మల్ నగర్ గ్రామలలో నూతన గ్రామ పంచాయతీ భనం ప్రారంభోత్స కార్యక్రమం సర్పంచ్లు దండు లావణ్య మల్లేశం, కర్రోళ కనకయ్య, రవి కంటి చెంద్రశేఖర్ గుప్తా, రజిత రాజేందర్ రెడ్డి, లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, ఆలేటి ఇంద్రసేన రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిధిగా రాష్ట్ర యఫ్ డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వెల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్,ఎమ్మెల్సీ యాదవరెడ్డి హాజరై వారి చేతుల మీదుగా ప్రాంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని అన్న నినాదం సీఎం కేసీఆర్ ఆ కళలను నిజం చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామపంచాయతీలో నూతన భావనలు, కుల భవనాలు, డీసీసీబీ బ్యాంకు ప్రారంభం అయ్యాయి.ఈ కార్యక్రమం లో ఎంపీపీ బాలేశం గౌడ్,జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్,ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి,పాక్స్ చైర్మన్ ఇంద్రసేన రెడ్డి, జిల్లా ఎంపీటీసీ ల ఫోరమ్ అధ్యక్షులు కిరణ్ గౌడ్, జిల్లా యూత్ విభాగం అధ్యక్షులు ఆలేటి సంతోష్ రెడ్డి,మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు రాచల్ల నరేష్,ఆయా గ్రామాల సర్పంచ్ లు,మండల రైతు సమన్వయ సమితి సభ్యులు బట్టు సుధాకర్ రెడ్డి,ఎంపీటీసీ లు, పలు గ్రామల బీ ఆర్ యస్ అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, ఏసి సెల్ అధ్యక్షులు, బిసి అధ్యక్షులు,వార్డు నెంబర్లు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.