ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,ఆగస్ట్ 1; మొయినాబాద్ మండల కేంద్రంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు.మొయినాబాద్ మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయడం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. నిన్న జరిగిన మంత్రివర్గ క్యాబినెట్లో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె గురించి వారి సమస్యల గురించి ప్రస్తావించకపోవడం దారుణమని గ్రామపంచాయతీ కార్మికులు పారిశుద్ధ్య పనులు పచ్చదనం కోసం ఎంతో కృషి చేస్తేనే కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వం జాతీయస్థాయిలో అవార్డులను పొందిందని అన్నారు.వారి శ్రమను గుర్తించి, సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో అసెంబ్లీని ముట్టడిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు రత్నం,మండల అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్,మహిళా నాయకురాలు ప్రమీల మండల నాయకులు కృష్ణ,సుధాకర్, గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.




