వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: గ్రామంలో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మౌలిక వసతులు కల్పిస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీర్చిదిద్దుతూ గ్రామ సర్పంచి రాములు నాయక్ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు . వికారాబాద్ మండలం కొటాలగూడ గ్రామపంచాయతీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రకృతి వనం డంపింగ్ యార్డ్ స్మశాన వాటిక మొదలు అభివృద్ధి పనులతో పాటు గ్రామానికి భారీగా నిధులు తీసుకువచ్చి గ్రామంలో ప్రతి కాలనీలో సిసి రోడ్లు వేసి ప్రజలకు సౌకర్యం కల్పిస్తున్నారు. గ్రామంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని డ్రైనేజీలను అండర్ డ్రైనేజీలుగా చేస్తూ గ్రామంలో పరిశుద్ధానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆర్థిక అభివృద్ధి దిశగా సాగుతారని గ్రామంలో ఎక్కడ కూడా మురుగునీరు నిలవకుండా వెంటనే చర్యలు తీసుకుంటూ గ్రామాభివృద్ధికి రాములు నాయక్ నిరంతరం కృషి చేస్తున్నారని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామపంచాయతీలో ఎలాంటి అభివృద్ధి లేక గ్రామంలో నడవలేని దుస్థితి ఉండేదని పేర్కొంటున్నారు. దాదాపు 40 లక్షల పైచిలుకు నిధులతో గ్రామంలో ప్రతి రోడ్డు సిసి రోడ్డుగా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఒక్కో వార్డు చొప్పున అన్ని వార్డులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయడం జరుగుతుందని కొటాలగూడ ఒకటో వార్డు సభ్యురాలు స్వరూప పేర్కొన్నారు. గ్రామ ప్రజల సహకారంతో సర్పంచ్ రాములు నాయక్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీర్చిదిద్దుతూ ఆదర్శంగా నిలుపుతున్నారని స్వరూప హర్షం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీర్చిదిద్దుతూ సర్పంచ్ రాములు నాయక్ గ్రామాన్ని ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.


