ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్టు 1 : రంగారెడ్డి జిల్లా,మంచాల్ మండల్ కేంద్రంలో గ్రామ పంచాయతి ఉద్యోగ,కార్మికులు చేస్తున్న సమ్మె 27 వ రోజుకు చేరింది.రైతు సంఘం నాయకులు,గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం నాయకులు కార్మికుల సమ్మె కు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు రావుల జంగయ్య మాట్లాడుతూ,గ్రామ పంచాయతి ఉద్యోగ,కార్మికులు గత 27 రోజుల నుండి సమ్మె చేస్తే పట్టించుకోకపోవడం వలన గ్రామాలలో పారిశుద్ధ్య పనులు చేసే వారు లేక ప్రజలు రోగాల భారిన పడే అవకాశం ఉంది అని అన్నారు.గ్రామాలలో వర్షాలు పడటం వలన దోమలు ఎక్కువై డెంగ్యూ,మలేరియా, టైపాయిడ్ లాంటి రోగాల ప్రబలే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అదేవిధంగా వీధిలైట్లు వేసే వారు లేక గ్రామాలు రాత్రిపూట చీకటిమాయంగ మారి ప్రజలకు పాములు,తేలు కరిచే ప్రమాదం ఉందని అన్నారు.కావున తక్షణమే జెఎసితో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘము మండల్ కార్యదర్శి కె. జంగారెడ్డి,గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం మండల నాయకులు ఎల్గపల్లి మల్లేష్,గ్రామ పంచాయతీ ఉద్యోగ,కార్మికుల సంఘం మండల అధ్యక్ష,కార్యదర్శులు ఖాజాపాషా,దూసరి భాస్కర్,ఏర్పుల రవి,జగన్,సురేష్




