వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 9: గ్రంథాలయాలు విజ్ఞాన బండాగారాలని గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని విజ్ఞానం పెంపొందించుకోవాలని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కోటి రూపాయల పైచిలుకు నిధులతో నిర్మాణం చేపట్టిన గ్రంథాలయ భవనాన్ని జిల్లా గ్రంధాలయ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గతంలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రంధాలయాల అభివృద్ధికి కృషి చేస్తూ గ్రంథాలయాల్లో పాఠకులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ అభివృద్ధికి బాటలు వేయడం జరుగుతుందన్నారు. గ్రంథాలయాలు విజ్ఞానాన్ని పెంపొందించే దేవాలయాలుగా ఆయన అభివర్ణించారు. జిల్లాలోని 18 మండలాల్లో గ్రంథాలయాలను సరైన విధంగా నిర్మాణం చేసి సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. పోటీ పరీక్షలకు ఉద్యోగాలకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు అన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచడం జరుగుతుందని అవసరమైన పుస్తకాలు కావాలని కోరితే తీసుకువచ్చి వారికి అందుబాటులో ఉంచడం జరుగుతుందని గ్రంథాలయ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్ తెలిపారు.తాండూర్ ఎమ్మెల్యే టికెట్ రోహిత్ రెడ్డికి. తాండూర్ ఎమ్మెల్యే టికెట్ పైలెట్ రోహిత్ రెడ్డికి లభిస్తుందని తాండూరులో బిఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని గ్రంథాలయ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. గతంలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకొని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి బాటలు వేయడం జరుగుతుందన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ కేసీఆర్ కిట్ ఆసరా పింఛన్లు విడో పింఛన్లు వికలాంగుల పింఛన్లు అందజేస్తూ పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రైతులకు రైతు రుణమాఫీ రైతుబంధు రైతు బీమా ఇలా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంటు ప్రాజెక్టులు ఏర్పాటు చేసి పాడిపంటలను సస్యశ్యామలం చేస్తూ రైతాంగం అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని సుశీల్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న టిఆర్ఎస్ పార్టీ మరోసారి విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలలో మంత్రి సబితా రెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయం అని పేర్కొన్నారు. ముఖ్యంగా తాండూరు టికెట్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి వస్తుందని భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏ నాయకుడు ఎన్ని కుయుక్తులు పనిని ప్రజలను పక్కదారి పట్టించిన నమ్మవద్దని రోహిత్ రెడ్డికి టికెట్ రావడం ఖాయమని భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయం అని అన్నారు. తాండూర్ నియోజకవర్గాన్ని వందల కోట్ల రూపాయలు తీసుకువచ్చి అభివృద్ధిలో తీర్చిదిద్దుతూ తాండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలపడం జరుగుతుందన్నారు.తాండూర్ అభివృద్ధి అంటే రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి అంటే తాండూరు అభివృద్ధి అన్న విధంగా తాండూర్ అభివృద్ధికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.



