గౌరవెల్లి గుండె గోడు

ప్రాజెక్టు నిర్మాణం కోసం
భూములు కోల్పోయినోళ్ళు
ఇల్లు ఇరువాటు ఇడిసినోళ్లు

ఇపుడు దిక్కులేని పక్షులై
సాయం కోసం ఆర్తిస్తున్నరు

ఆదుకున్న పాపానికి
వాళ్లకు ఏమి మిగిలింది?

పోలీసు లాఠీల దెబ్బలు
అక్రమ కేసుల మోపులు
ఉక్కు సంకెళ్ల బంధనాలు
దోషులన్న నిందలు తప్పా!

నిర్వాసితులు ఆవడమంటే
నేలను కోల్పోవడమే కాదు
బంధాల తంత్రులు తెగడం
తరాల ఆనవాళ్లు చెదరడం
ఊపిరి దీపాలు కొడిగట్టడం
అస్తిత్వాలు బుగ్గి పాలవడం

అయినా..
తిన్న కంచం ఎగతన్నడం
తాగిని రొమ్ముల చీల్చడం
నమ్మించి నట్టేట ముంచడం
పాలకులకు పరిపాటయింది
అందుకే ఇంతటి దాష్టికాలు

పాలకవర్యా !
ఇకనైనా బాధితులకు
నష్టపరిహారం చెల్లించి
పునరావాసం కల్పించి
తప్పిదాలను సరిదిద్దుకో

కాదంటే పల్లె పల్లెలు ఏకమై
గడీల బురుజుల ముట్టడిస్తయ్‌
‌పొలిమేర దాకా తరుముతయ్‌

  (‌గౌరవెల్లి భూనిర్వాసితుల అరిగోసకు
స్పందనగా..)
 – కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *