గొర్రెల పెంపకందారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి 

చిన్నకోడూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11: గొర్రెల పెంపకందారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ తెలిపారు. రెండవ విడత గొర్రెల యూనిట్లను మండల పరిధిలోని చంద్లాపూర్ గ్రామంలో  ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల పెంపకం దారుల సంఘం చైర్మన్ శ్రీహరి యాదవ్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గత ప్రభుత్వాల హాయంలో గొల్ల కురుమలను పట్టించుకోలేదని అన్నారు. కొన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ పథకం పై తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.డీడీలు కట్టిన ప్రతి లబ్ధిదారునికి తప్పకుండా రెండో విడత గొర్రెలు వస్తాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని కుల వృత్తులకు ప్రాధాన్యత ఇస్తూ కుల వృత్తుల కోసం ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు.  గొర్రెలు పంపిణీ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.ఇతర రాష్ట్రాలకు మాంసం ఉత్పత్తులు ఎగుమతి చేసే విధంగా గొల్ల కురుమలు గొర్రెలను పెంపొందించాలని సూచించారు.గొర్రెల షెడ్ల నిర్మాణాలను పరిశీలించారు.కొద్ది రోజుల్లోనే నిర్మాణాలు పూర్తి చేసి మంత్రిచే గొర్రెల షెడ్లలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వెటర్నరీ జెడి జగత్ కుమార్ రెడ్డి, రైతు సమన్వయ జిల్లా సభ్యులు వెంకటేశం, వెటర్నరీ డాక్టర్ మంజుల, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వనిత రవీందర్ రెడ్డి,వైస్ చైర్మన్ కుంటయ్య, సర్పంచ్ చంద్రకళ రవి గౌడ్, ఎంపీటీసీ దుర్గారెడ్డి ,అల్లిపూర్ సొసైటీ డైరెక్టర్ భరత్, యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *