గృహలక్ష్మి దరఖాస్తుల పరిశీలన

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 19 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం కింద ఆమనగల్లు మండలం లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. శనివారం మేడిగడ్డ, మంగళపల్లి ఆకుతోటపల్లి తదితర గ్రామాలలో దరఖాస్తు దారుల ఇంటికెళ్లి ఆయా గ్రామ కార్యదర్శులు పరిశీలిస్తున్నారు. మేడిగడ్డ తండాలో 110 దరఖాస్తులందాయని వాటిని పూర్తిగా పరిశీలించిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని కార్యదర్శి వెంకటయ్య తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *