- ‘ఉజ్వల’ కింద 75 లక్షల మంది మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్
- కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూ దిల్లీ, ఆగస్ట్ 29 : ఓనం, రక్షాబంధన్ పండుగల సందర్భంగా, గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్లపై ధరను 200 వరకు తగ్గించడానికి కేంద్ర మంత్రివర్గం మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అనురాగ్ టాకూర్ తెలిపారు. ఉజ్వల పథకం కింద 75 లక్షల మంది మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లకు కూడా కేబినెట్ ఆమోదించింది.
ఉజ్వల పథకం కింద ఉన్న లబ్ధిదారులందరికీ ఇప్పుడు సిలిండర్‌పై రూ.400 సబ్సిడీ లభిస్తుంది. త్వరలో జరుగబోయే 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు కేంద్రం ఈ నిర్ణయ తీసుకోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. క్యాబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ టాకూర్ మీడియాకు వివరించారు.




