గులాబీకే జై కొట్టిన గుర్రాలగొంది

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 15: మా వోట్లు అన్ని గంపగుత్తగా మంత్రి హరీష్ రావుకే వేస్తామని  గుర్రాలగుంది గ్రామస్తులు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గ  పరిధిలోని గుర్రాలగొంది గ్రామంలో బుధవారం గ్రామస్తులు అందరు కలిసి మంత్రి హరీష్ రావుకు మద్దతు తెలుపుతూ అన్ని కుల సంఘాలు మంత్రి హరీష్ రావుకు ఏకగ్రీవ తీర్మానాలను ప్రజాప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ… వచ్చే ఎన్నికలలో మంత్రి హరీష్ రావును భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత మంత్రి హరీష్ రావుకే దక్కిందని వారు తెలిపారు. అనంతరం గ్రామంలో కొంతమంది బిజెపి పార్టీకి చెందిన యువకులు  ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అంతకుముందు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులతో కలిసి ఇంటింటి ప్రచారం చేసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలకృష్ణ,  గ్రామాన్ని దత్తత తీసుకున్న రవీందర్, సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ హరీష్, మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య, వైస్ ఎంపీపీ సంతోష్ కుమార్, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు ఎల్లారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ,ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు,  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *