గుజరాత్‌లో తొలి విడత పోలింగ్‌ ‌ప్రారంభం

భారీగా తరలి వచ్చి క్యూలో నిల్చున్న వోటర్లు
తొలిసారి వోటేస్తున్న వారికి ప్రధాని మోదీ అభినందనలు
బిజెపి అభ్యర్థిపై దాడిపట్ల పార్టీ నేతల ఆగ్రహం

గుజరాత్‌ అసెంబ్లీకి మొదటి విడత పోలింగ్‌ ‌కొనసాగుతోంది. ప్రశాంత వాతావరణంలో గురువారం పోలింగ్‌ ‌ప్రారంభమయ్యింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కునేందుకు భారీగా తరలి వచ్చారు. వృద్ధులు కూడా ఓటు వేసేందుకు ఉత్సాహంగా తరలి రావడంతో క్యూలు కట్టారు. యువత కూడా ఓటు హక్కును వినియోగించేందుకు వచ్చారు. కొన్ని పోలింగ్‌ ‌సెంటర్లలలో ఇప్పటికే ఓటర్లు భారీగా తరలి వచ్చి క్యూలో నిలచున్నారు. కాగా, మొదటిసారి ఓటు వేస్తున్న వారికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో మొత్తం 89 స్థానాలకు పోలింగ్‌ ‌జరుగుతోంది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ‌సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 2 కోట్ల 39 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 14వేల 382 పోలింగ్‌ ‌స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ నెల 5న రెండో విడత పోలింగ్‌ ‌జరగనుంది.రో వైపు గుజరాత్‌ ‌మొదటి విడత పోలింగ్‌ ‌లో పలువురు నేతలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్‌ ‌గవర్నర్‌ ‌మంగూభాయ్‌ ‌పటేల్‌ ‌కుటుంబ సభ్యులతో కలిసి నవ్సారి పోలింగ్‌ ‌సెంటర్‌ ‌లో ఓటు వేశారు. అలాగే క్రికెటర్‌ ‌రవీంద్ర జడేజా భార్య, బీజేపీ అభ్యర్థి రివాబా జడేజా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్‌ ‌కోట్‌ ‌లోని పోలింగ్‌ ‌సెంటర్‌ ‌లో ఆమె ఓటు వేశారు. జామ్‌ ‌నగర్‌ ‌నియోజకవర్గంలో రివాబా జడేజా పోటీ చేస్తున్నారు.

ఇదిలావుంటే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్‌కు బీజేపీ అభ్యర్థిపై దాడి జరిగింది. నవ్‌సారి జిల్లా (వాన్‌స్దా నియోజకవర్గం)లోని వాన్‌స్డా స్థానం నుంచి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి పియూష్‌ ‌పటేల్‌ ‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో బీజేపీ అభ్యర్థి పీయూష్‌ ‌పటేల్‌ ‌తలకు తీవ్రంగా గాయం అయ్యింది. గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో పీయూష్‌తో పాటు వచ్చిన 4 నుంచి 5 మంది బీజేపీ కార్యకర్తలు కూడా గాయపడ్డారు. దీంతో పాటు కాన్వాయ్‌లో నడుస్తున్న 3 నుంచి 4 వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. పీయూష్‌ ‌పటేల్‌ ఎన్నికల ప్రచారంలో వన్ద్సా సీటులోని ఝరి గ్రామంలో ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి అనంత్‌ ‌పటేల్‌ ‌మద్దతుదారులు ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. వాన్‌స్డా పోలీస్‌ ‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పీయూష్‌ ‌పటేల్‌ ‌మద్దతుదారులు కాంగ్రెస్‌ ‌పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓటు వేయకముందే కాంగ్రెస్‌ ‌పూర్తి ప్రణాళికతో ఈ దాడి చేసిందని బీజేపీ చెబుతోంది. దాడి అనంతరం బీజేపీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాస్తవానికి, వాన్‌స్దా తాలూకాలోని జారి గ్రామంలో, పియూష్‌ ‌మరియు కొంతమంది బిజెపి కార్యకర్తలు ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు వాన్‌స్డా పోలీస్‌ ‌స్టేషన్‌కు చేరింది. గుజరాత్‌ ఎన్నికలు ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *