గుండెపోటుతో యూత్ కాంగ్రెస్ నాయకుడు మోయిన్ కన్నుమూత

తాండూరు, ప్రజాతంత్ర, జులై 18: గుండెపోటుతో యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మోయిన్ గుండెపోతుతో హఠాత్మరణం చెందారు గుండెపోటుతో అకాల మరణం చెందిన అల్లుడు మోయిన్ చూసేందుకు వచ్చిన మామ అల్లుడు హఠాత్ మరణం తట్టుకోలేక మామ కూడా గుండెపోటుతో మరణించిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. ఇద్దరి అకాల మరణం వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. తాండూరు పట్టణం బృందావన కాలనీలో నివాసముండే మోయిన్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు.మోయిన్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ మామ మున్నాబాయికి చెందిన ట్రాన్స్ పోర్ట్ పనులు చూసుకుంటు ఉండేవారు. మంగళవారం ఉదయం మోయిన్ గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలిసి మోయిన్ ను చూసేందుకు వచ్చిన మామ మున్నబాయి కూడ హర్ట్ అటాక్ కు గురై అపస్మారక స్థితికి వెళ్లడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లి లోపు ఆయన కూడా మరణించారు. ఈ సంఘటనలు వారి కుటుంబంలో విషాధం నింపాయి. మోయిన్ మరణవార్త తెలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ తదితరులు కుటుంబాన్ని పరామర్శించారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మోయిన్ అకాల మృతికి తీవ్ర సంతాపం తెలియజేసి వారి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *