సుమారు 13 లక్షల పైచిలుకు వోటర్లు కలిగి ఉన్న మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం కింద 7 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో డోర్నకల్, మహబూబాబాద్, ఇల్లందు, భద్రాచలం పినపాక, నర్సంపేట, ములుగు, నియోజకవర్గాలు ఉన్నాయి.
గత 2023 శాసనసభ ఎన్నికల్లో ఏడు నియోజక వర్గాల మొత్తంగా పొందిన వోట్లు …
6,85,897
కాంగ్రెస్ పార్టీ
4,43,910
భారత్ రాష్ట్ర సమితి
34,431
భారతీయ జనతా పార్టీ (అన్ని నియోజక వర్గాల్లో డిపాజిట్ గల్లంతు )
ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ
గత ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌దే విజయం
మారిన పరిస్థితుల్లో వోటరు నాడి ఎటువైపు..విజయం ఎవరిని వరించనుందో..

బలరామ్ నాయక్
మాలోతు కవిత
సీతారామ్ నాయక్
మహబూబాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : మానుకోట గిరిజన కోటలో ముక్కోణపు సమరం సాగుతుంది. వొచ్చే నెల 13న జరగనున్న ఎన్నికల్లో నామినేషన్ తుది అంకం మరో రోజుతో ముగియనుండడంతో ప్రధాన పార్టీల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే నేతలు ప్రజాక్షేత్రంలో తమ భవిష్యత్తును పరీక్షించుకోదలచి రాజకీయ చతురత ప్రదర్శిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం ముగించారు. ఇక బిఅర్ఎస్ అధినేత కేసిఆర్ మే 1న రోడ్ షో నిర్వహించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక బిజెపి ఇప్పటికే నామినేషన్ పర్వానికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వొచ్చారు. ఇక అమిత షా లేదా ప్రధాని బహిరంగ సభ పెట్టేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. గెలుపు ఎవరిని వరించనుందో తెలియదుగానీ సుమారు 13 లక్షల పైచిలుకు వోటర్లు కలిగి వున్న మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రధానంగా మూడు పార్టీలైన కాంగ్రెస్, బిఅర్ఎస్, బిజెపి మధ్యే పోటీ నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరామ్ నాయక్, బిజెపి నుంచి ప్రొఫెసర్ సీతారామ్ నాయక్, బిఅర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత బరిలో ఉన్నారు. ముగ్గురు ఈ స్థానం నుంచి ఎంపిలుగా గెలిచి లోక్ సభకు వెళ్ళినవారే. 2019లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరామ్ నాయక్‌పై సిట్టింగ్ ఎంపి బిఅర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత లక్ష వోట్ల మెజారిటీతో గెలుపొందారు. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో భద్రాచలం మినహాయించుకుని మిగిలిన ఆరింట్లోనూ కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. ఆ తర్వాత భద్రాచలంలో గెలిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరడంతో ఏడింటిలోనూ కాంగ్రెస్ అధికార స్థానంలో నిలిచింది. ఇక మొదటి నుంచి భాజపా ఉనికి లేకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం వొచ్చిన తర్వాత భాజపా అభ్యర్థి హుస్సేన్ నాయక్ తన వ్యక్తిగత ఇమేజ్ పార్టీ సహకారంతో రెండు పర్యాయాలు అసెంబ్లీకి, ఒక పర్యాయం పార్లమెంటుకు పోటీ చేసి 20 నుంచి 30 వేల వోట్లను చేజీకించుకొని డిపాజిట్లు కూడా కోల్పోయారు.
మహబూబాబాద్ ఎన్నికల సమరంలో ఎవరి బలం ఎంత….
1957లో పార్లమెంట్ స్థానం ఏర్పడి 1967లో రద్దయిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల డీలిమిటేషన్‌ను అమలు చేసిన తర్వాత ఈ నియోజకవర్గం 2008లో ఉనికిలోకి వొచ్చింది. మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం కింద 7 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో డోర్నకల్, మహబూబాబాద్, ఇల్లందు, భద్రాచలం పినపాక, నర్సంపేట, ములుగు, నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో నర్సంపేట మాత్రమే జనరల్ స్థానం, కాగా మిగిలిన 6 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలే. 2009లో డిలిమిటేషన్‌తో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోరిక బలరామ్ నాయక్, మహా కూటమి సీపీఐ నుంచి కుంజా శ్రీనివాసరావు, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నుంచి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డీటీ నాయక్ పోటీపడ్డారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పోరిక బలరామ్ నాయక్‌కు 3,94,447 వోట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి సీపీఐ కుంజా శ్రీనివాసరావుకు 3,25,490 వోట్లు లభించాయి. పీఆర్పీ అభ్యర్థి డీటీ నాయక్‌కు 1,45,299 వోట్లు లభించాయి. బలరామ్‌కు 68,957 వోట్ల మెజార్టీ లభించింది. 2014 ఎన్నికలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్ర సమితి అభ్యర్థి ప్రొఫెసర్ సీతారామ్ నాయక్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 3,20,569 వోట్లు రాగా కాంగ్రెస్ నుంచి కేంద్ర మంత్రిగా బలరామ్ నాయక్‌కు 2,85,577 వోట్లు సాధించారు. టీడీపీ నుంచి బరిలో నిలిచిన మోహన్ లాల్‌కు 2,15,904 వోట్లు పోలయ్యాయి 2018 జరిగిన సార్వత్రిక ఎన్నికలో ప్రధానంగా టిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొని వుంది. టీఆర్ఎస్ నుంచి మాలోత్ కవితకు 4,62,109 వోట్లు రాగా ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి బలరామ్ నాయక్‌కు 3,15,446 వోట్లు పోలయ్యాయి. లక్షకు పైగా వోట్ల మెజార్టీతో కవిత విజయం సాధించారు. ఇక 2024లో జరుగుతున్న ఎన్నికలో ప్రధానంగా కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ వుండబోతుందని, భాజపాకు సంబంధించి కొంత మోదీ ప్రభావం చూపినా పార్టీ గ్రామ స్థాయిలో లేకపోవడం, గత ఎన్నికల్లోనూ లక్ష వోట్లు కూడా సాధించకపోవడం ఆ పార్టీకి గుర్తింపు కష్టమే అనిపిస్తుంది.
కాంగ్రెస్, భాజపాల్లో వర్గ పోరు…బిఅర్‌ఎస్‌కు కలిసి వొచ్చేనా?
ఆది నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న మహబూబాబాద్ పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఉండడంతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు రెండు ఎన్నికల్లో ఓటమి చెందిన బలరామ్ నాయక్‌పై కొంత సానుభూతి కనిపిస్తుంది. అదే విధంగా తను కేంద్ర మంత్రిగా వున్నప్పుడు ఈ ప్రాంతంలో విద్య, వైద్యం, రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టడం..దీనికి తోడు ముఖ్యమంత్రి ఈ పార్లమెంట్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం చేపట్టడం, భదాద్రి రాముని సాక్షిగా 2 లక్షలు రుణమాఫీ ప్రకటించడం కాంగ్రెస్‌కు కలిసివొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. అలా అని వ్యతిరేకత కూడా లేకపోలేదు. బలరామ్ నాయక్ ఈ పరిధిలో ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కొంత మందికి టికెట్లు రాకుండా అడ్డుకుని కలుగజేసుకున్నాడని, అడ్డుకున్నవారికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం, గెలవడంతో వారికి ఇప్పుడు ప్రతీకారం తీర్యుకునే అవకాశం వొచ్చినట్టు, వారు ఇదే అదనుగా తమ వ్యతిరేక వైఖరి చూపిస్తునట్టుగా తెలుస్తుంది. అందుకు ముఖ్యమంత్రి జన జాతర సభకు జనాల తరలింపులోను ఎమ్మెల్యేల వైఖరి తేటతెల్లం అయ్యింది. సుమారుగా లక్ష మందితో ముఖ్యమంత్రి కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నప్పటికీ జన సమీకరణ చేయడంలో ఎమ్మెల్యేలు విఫలమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికితోడు అసెంబ్లీ ఎన్నికలో వున్న ఊపు కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికలో కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో గిరిజనులు వ్యవసాయ రైతులు కూలీలుగా వుండటం, రైతులకు పంటలకు నీరు అందించక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక బిఅర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత మొదటి నుంచి కొంత రాజకీయ దూకుడుతనం ప్రజల్లో ఇట్టే కలసి పోవడం, ప్రత్యర్థి పార్టీ నాయకులతో కూడా సత్సంబంధాలు కొనసాగించడం..7 నియోజకవర్గాల్లో కొరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అవసరమైన కిట్లు వస్తు సామాగ్రి తన సొంత డబ్బులను ఖర్చుపెట్టి అందించిన ఘనత వుంది. ఇక మైనెస్ విషయానికీ వొస్తే పార్లమెంట్ పరిధిలో విభజన హామీలపై గళం ఎత్తకపోవడం, బయ్యారం ఉక్కు పరిశ్రమపై కేంద్రంపై ఒత్తిడి తేలేదని, కేవలం డోర్నకల్, మహబూబాబాద్, భద్రాచలం నియోజకవర్గాల్లో మాత్రమే తన మార్కు చూపించారని, విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు భద్రాచలం భూ వివాదంలో తల దూర్చినట్టు, అనుకున్నా స్థాయిలో పార్లమెంట్లో అభివృద్ధి పట్టించుకోలేదని అపవాదులు వినిపిస్తున్నాయి. ఇక బిజెపి విషయానికొస్తే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో గతంలో ఉనికి చాటాలనుకున్నా డిపాజిట్ కూడా రాకపోవడంతో ఈసారి అభ్యర్థిని మార్చి తమ భవిష్యత్తును పరీక్షించుకోవాలని కమల దళం నిర్ణయించుకుని బిఆర్ఎస్ క్రియాశీలక నాయకుడు మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారామ్ నాయక్ భాజాపాలోకి చేర్చుకుని పార్లమెంటు సీట్ కేటాయించారు. మోదీ బలం, హిందూత్వ ఏజెండా, అభ్యర్థి విద్యావంతుడు ప్రొఫెసర్ కావడం, గతంలోనూ ఈ పార్లమెంట్ పరిధిలో సమస్యలపై అవగాహన ఉండటం వంటి అనుకూల అంశాలతో ప్రజల్లోకి భాజాపాని తీసుకు వెళ్లడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోదీ అమిత్ షా ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ నామినేషన్ పర్వం ముగిసిన వెంటనే అన్నామలై లాంటి చురుకైన నాయకులను 10 మంది వరకు దింపి 7 నియోజకవర్గాల్లో ప్రచారానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఇప్పుడే పురుడు పోసుకుంటున్న భాజపాలో అంతర్గత పోరు మొదలైంది. నాయకుల సహకారం తక్కువగా వుండటం మరొక ప్రధాన అంశం. ముందు నుంచి బిజెపి కోసం పనిచేసిన హుస్సేన్ నాయక్‌ను కాదని ఎన్నికల వేళ పార్టీలో చేరిన సీతారామ్ నాయక్‌కు టికెట్ ఇవ్వడంపై పార్టీ శ్రేణులు మింగుడు పడక సహకారం అందడం కష్టంగా మారింది. వెరసి ముక్కోణపు సార్వత్రిక పోరులో ఎవరు పాగా వేస్తారో వేచి చూడాలి.