తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 14: రాజు గుర్తుపైన ఎన్నికల బరిలో జనసేన పార్టీ ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ తేలిపారు. తెలంగాణలో జనసేన గుర్తు గల్లంతు అని వచ్చిన కథనాలపై తాండూరు జనసేన అభ్యర్థి వేమూరి శంకర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం తాండూరు పట్టణం లోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి శంకర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి జనసేన పోత్తులో భాగంగా ఎన్నికలో పోటీ చేయడం జరుగుతుందని అన్నారు. జనసేన పార్టీని తెలంగాణలో విస్తరించకుండా ఉండేందుకు కొంతమంది రాజకీయ నాయకులు కొన్ని మీడియా సంస్థలతో కలసి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. తెలంగాణలో జనసేన పార్టీ గాజు గుర్తు పైననే ఎన్నికల బరిలో ఉంటుందని అన్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లో జనసేన పార్టీ తో తన పేరును కూడా పొందుపరచడం జరిగిందని తెలిపారు. కొందరు రాజకీయ శక్తులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని అన్నారు. నేను జనసేన పార్టీ గాజు గుర్తుపైననే పోటీలో ఉంటున్నట్లుగా తెలియజేశారు. ప్రజలందరూ ఆదరించి గాజు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
గాజు గుర్తుపైన ఎన్నికల బరిలో జనసేన పార్టీ





