గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, విూర్‌ అవిూర్‌ అలీఖాన్‌ తమిళి సై ఆమోదం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 25 : గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, విూర్‌ అవిూర్‌ అలీఖాన్‌ల ఎంపికకు తమిళి సై సౌందరరాజన్‌ ఆమోదం తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి పంపిన ప్రతిపాదనలకు గవర్నర్‌ ఆమోదం తెలిపింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌, సియాసత్‌ పత్రిక రెసిడెంట్‌ ఎడిటర్‌ జావెద్‌ అలీఖాన్‌ కుమారుడు విూర్‌ అవిూర్‌ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. ఈ మేరకు గవర్నర్‌ కార్యాలయం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌, మరొకరి పేరును ప్రభుత్వం ప్రతిపాదించగా.. గవర్నర్‌ తిరస్కరించారు. దాంతో ఆ రెండు స్థానాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ స్థానాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇద్దరు పేర్లను ప్రతిపాదించగా.. గవర్నర్‌ తమిళిసై ఆమోద ముద్ర వేశారు.

కోదండరామ్‌కు టిఎన్జీవోల అభినందనలు
ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు టీఎన్జీవో కేంద్ర సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏఐఎస్‌జీఈఎఫ్‌ జాతీయ ఉపాధ్యక్షుడుమారం జగదీశ్వర్‌, టీఎన్జీవో రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, పర్వతాలు, తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్‌, లక్ష్మణ్‌ తదితరులు గురువారం ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్‌లో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.  తమిళిసై సౌందరరాజన్‌ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ను నియమించారు. తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, విూర్‌ అవిూర్‌ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియామకమయ్యారు. వీరిద్దర్ని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాజ్‌ భవన్‌ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలిపారు. అందులో భాగంగా కోదండరామ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని రేవంత్‌ రెడ్డి హావిూనిచ్చారు. నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోదండరామ్‌ను ఎమ్మెల్సీగా ఖరారు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *